Animal 4 Days Collections: రణ్‌బీర్ మాస్ బ్యాటింగ్.. అన్ని వందల కోట్లు ఔట్.. కోట్ల లాభాలతో సంచలనం
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ఇండియా వ్యాప్తంగా మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకున్న హీరో రణ్‌బీర్ కపూర్. ఆరంభంలో ప్రేమకథలతోనే సినిమాలు చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'యానిమల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీకి 4 రోజుల్లో వచ్చిన వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
ఊరమాస్ యానిమల్ రాక:రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన చిత్రమే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.

యానిమల్ మూవీ బిజినెస్:హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
నాలుగో రోజు వసూళ్లు ఇలా:సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. దీంతో మొదటి రోజు రూ. 63.80 కోట్లు, రెండో రోజు రూ. 66.27, మూడో రోజు రూ. 71.46 కోట్లు నెట్ వసూళ్లను ఇది రాబట్టింది. నాలుగో రోజు మాత్రం ఇది డౌన్ అయింది. దీంతో ఈ చిత్రం రూ. 39.90 కోట్లు నెట్ వసూళ్లను మాత్రం రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో:క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా నాలుగు రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 13 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 108 కోట్లు రాబట్టింది.
నాలుగు రోజులకు కలిపితే:రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి నాలుగు రోజుల్లోనూ అదిరిపోయే రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ నాలుగు రోజుల్లో రూ. 241.43 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 420 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:యాక్షన్ జోనర్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 4 రోజుల్లోనే ఈ సినిమా రూ. 241 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 31 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











