Animal 9 Days Collections: చరిత్ర సృష్టించిన యానిమల్.. ఇండియాలో ఫస్ట్ మూవీ.. తెలుగులో సంచలన రికార్డు
బాలీవుడ్‌లో తనదైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు రణ్‌బీర్ కపూర్. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ సక్సెస్‌లు సొంతం చేసుకుంటోన్న అతడు.. ఇటీవలే 'యానిమల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. రెండో వారంలోనూ ఇది జోరును కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రెండో వీకెండ్‌లో దుమ్ముదులుపుతోంది. మరి 'యానిమల్' మూవీకి 9 రోజుల్లో వచ్చిన వసూళ్లపై మీరే లుక్కేయండి!

యానిమల్‌గా ఎంటరైన స్టార్: రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన సినిమానే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.

యానిమల్ మూవీ బిజినెస్: ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

9వ రోజు ఎంత వచ్చింది?: సందీప్ రెడ్డి వంగా - రణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన 'యానిమల్' మూవీకి భారీ స్పందన వస్తోంది. దీంతో తొలి రోజు రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు వచ్చాయి. ఇక, 9వ రోజు రూ. 37 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: యాక్షన్ కంటెంట్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 9 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 21 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 175 కోట్లు రాబట్టింది.

తొమ్మిది రోజులకు కలిపితే: రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి తొమ్మిది రోజుల్లోనూ అదిరిపోయే రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ తొమ్మిది రోజుల్లో రూ. 398.53 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 650 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.
టార్గెట్ ఇలా.. లాభం అలా: అదిరిపోయే యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9 రోజుల్లోనే ఈ సినిమా రూ. 400 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 190 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

అక్కడ చరిత్ర.. ఇక్కడేమో: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీకి 9వ రోజైన రెండో శనివారం ఏకంగా రూ. 37 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. తద్వారా ఇంత మొత్తం వసూలు చేసిన ఏకైక హిందీ చిత్రంగా ఇది సరికొత్త చరిత్రను సృష్టించింది. అదే సమయంలో ఈ చిత్రం తెలుగులో రూ. 30 కోట్లు షేర్ మార్కును దాటేసింది. తద్వారా ఈ మైలురాయిని వేగంగా చేరిన హిందీ చిత్రంగా రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











