Animal Day 1 Collections: యానిమల్‌పై కోట్ల వర్షం.. ఒక్క రోజే 100 కోట్లు ఔట్.. ప్రభాస్ మూవీ కంటే!
హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలకు మాత్రమే దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనదైన టాలెంట్లతో సత్తా చాటుతూ తన రేంజ్‌ను పెంచుకున్నాడు.
దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'యానిమల్' అనే వైల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి మంచి టాక్, రెస్పాన్స్ వచ్చాయి. మరి 'యానిమల్' మూవీ తొలి రోజు వసూళ్లను మీరే చూసేయండి మరి!

వైల్డ్ యాక్షన్‌తో యానిమల్: రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి కాంబోలో వచ్చిన మూవీనే 'యానిమల్'. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు దీన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్: స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
అలాంటి టాక్‌తో భారీగానే: రణ్‌బీర్ హీరోగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'యానిమల్' మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1వ తేదీన విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో భారీ స్పందనే వచ్చింది. దీంతో ఈ మూవీకి అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

మొదటి రోజు నెట్ కలెక్షన్లు: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీంతో హిందీలో రూ. 50.5 కోట్లు, తెలుగులో రూ. 10 కోట్లు, తమిళంలో రూ. 40 లక్షలు, కర్నాటకలో రూ. 9 లక్షలు, కేరళలో రూ. 1 లక్షలతో కలిపి మొదటి రోజే ఈ సినిమాకు రూ. 61 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది: 'యానిమల్' మూవీకి ఇండియాలో రూ. 70 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక మొదటి రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్లను (33 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే ఫస్ట్ డే రూ. 103 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 61 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 149 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.

హిందీలో మూడో స్థానానికి: రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ మొదటి రోజు ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా 2023లో హిందీలో ఓపెనింగ్ డేన అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 3వ స్థానానికి చేరింది. ఈ క్రమంలోనే గదర్ 2, ఆదిపురుష్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో జవాన్, పఠాన్ టాప్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











