Animal Business: యానిమల్ మూవీకి రికార్డు బిజినెస్.. తెలుగులో సంచలనం.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

గతంలో కంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం సౌతిండియన్ మూవీ మార్కెట్లపై ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలోనే ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన క్రేజీ మూవీనే 'యానిమల్'. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ హైప్‌తో వచ్చిన సినిమా కావడంతో దీనికి బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

యానిమల్ అంటూ వచ్చారు
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబోలో రూపొందిన సినిమానే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.

Ranbir Kapoor Starrer Animal Movie Pre Release Business Details

అలాంటి స్టోరీ.. ఫుల్ వైల్డ‌ుగా
చిన్న వయసు నుంచే తండ్రికి దూరంగా ఉన్న కొడుకు.. సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి వస్తాడు. ఆ తర్వాత తండ్రి కోసం ఎంతటికైనా తెగించేందుకు సిద్ధం అవుతాడు. అసలు హీరో తండ్రికి ఏం జరిగింది? దాని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఇంతకీ హీరో, అతడి తండ్రి కలుసుకున్నారా? అనే అంశాలతో రూపొందిన సినిమానే 'యానిమల్'. ఇది ఫుల్ వైల్డ్ కంటెంట్‌తో రూపొందింది.

Ranbir Kapoor Starrer Animal Movie Pre Release Business Details

గ్రాండ్ రిలీజ్.. మంచి టాక్
విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుని తాజాగా వచ్చిన సినిమానే 'యానిమల్'. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఇండియాలోనూ ఇదే కనిపిస్తోంది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా దీనికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

యానిమల్ బిజినెస్ ఇలా
యాక్షన్ ఎలిమెంట్లతో సాగే స్టోరీతో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీనికి డిమాండ్ బాగా వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని రూ. 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంటే.. రూ. 15 కోట్లు వస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది.

Ranbir Kapoor Starrer Animal Movie Pre Release Business Details

వరల్డ్ వైడ్‌ బిజినెస్ ఎంత

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకే దీన్ని దక్షిణాది భాషల్లో సైతం గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇలా అన్ని ఏరియాల్లోనూ ఇది మంచి బిజినెస్‌ను చేసుకుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 250 కోట్లు బిజినెస్ చేసుకుంది. అంటే రూ. 252 కోట్లు నెట్ వస్తేనే ఇది హిట్ అవుతుంది.

తెలుగులో సంచలనమే
'యానిమల్' మూవీ థియేట్రికల్ హక్కులకు గానూ దిల్ రాజు పెట్టిన మొత్తం గతంలో ఏ బాలీవుడ్ మూవీకి పెట్టలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బిజినెస్ చేసుకున్న సినిమాగా 'యానిమల్' సంచలన రికార్డును నమోదు చేసింది. ఇక, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం టాక్ కూడా మంచిగా వస్తే ఈ మొత్తం రికవరీ చేయడం ఈజీనే అనొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X