Rang De Collections: ఓవర్సీస్‌లో జోరుగా.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్
యువ హీరో, హీరోయిన్లు నితిన్, కీర్తి సురేష్ జంటగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన రంగ్ దే చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 26వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల తొలి రోజు అంచనా కలెక్షన్లు ఎలా ఉందంటే..

600 వందలకుపైగా థియేటర్లలో
రంగ్ దే చిత్రం టీజర్ల్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. దాంతో భారీగా థియేటర్లలోకి రావడానికి దోహదపడింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 610 థియేటర్లలో అట్టహాసంగా రిలీజైంది.

నైజాం, ఆంధ్రాలో బిజినెస్
చెక్ సినిమా నితిన్‌కు నిరాశ పరిచినా రంగ్ దే సినిమా విషయానికి వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఎలాంటి ప్రభావం పడలేదు. నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ.7.6 కోట్లు, సీడెడ్‌లో రూ.3.6 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లతో మొత్తంగా రూ.23.9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఓవర్సీస్ ప్రీ రిలీజ్ వివరాలు
తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.2 కోట్ల బిజినెస్, ఓవర్సీస్‌లో రూ.1.5 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.26.6 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. దాదాపు రూ.27.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో ఈ చిత్రం బరిలోకి దిగింది.

తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఓపెన్సింగ్స్
ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం తొలి రోజున భారీగానే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. వైజాగ్‌లో తొలి రోజున ఉదయం, మధ్యాహ్నం ఆటల కలెక్షన్లు దాదాపు రూ.5 లక్షలకుపైగానే వసూళయ్యాయి. వరంగల్, రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో భారీ ఒపెనింగ్స్ నమోదైనట్టు తెలిసింది. దీంతో ఈ చిత్రం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా రాబట్టే అవకాశం ఉంది.

యూఎస్, ఆస్ట్రేలియాలో వసూళ్లు
ఇక యూఎస్‌లో రంగ్ దే చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు బ్రహ్మండంగా నమోదయ్యాయి. గురువారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్లకు మంచి స్పందన కనిపించింది. అమెరికా కాలమానం ప్రకారం.. 68 లొకేషన్లలో 29 వేల డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం. అలాగే ఆస్ట్రేలియాలో 25 వేల డాలర్లు కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











