Ranga Maarthaanda day 1 collections రంగ మార్తండకు భారీ ఓపెనింగ్స్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటించిన రంగ మార్తండ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి ప్రశంసలు అందుకొన్నది. సినీ ప్రముఖులు, సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా మంచి అంచనాలతోనే బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా
మరాఠీలో అవార్డులతోపాటు ప్రశంసలు అందుకొన్న నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా రంగ మార్తండ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా హక్కులను మొదట ప్రకాశ్ రాజ్ చేజిక్కించుకొన్నారు. అయితే స్వయంగా దర్శకత్వం వహించి తెరకెక్కించాలనే భావించిన ప్రకాశ్ రాజ్.. కొన్ని కారణాల వల్ల దర్శకుడు కృష్ణ వంశీ చేతిలో పెట్టారు. దాదాపు ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.

మైత్రీ మూవీ మేకర్స్ చేతికి..
రంగ మార్తండ చిత్రాన్ని రిలీజ్‌కుముందు థియేట్రికల్ రైట్స్‌కు మంచి ఆఫర్ లభించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 4 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

రంగ మార్తండ ఆక్యుపెన్సీ
మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగ మార్తండకు భారీగానే రెస్సాన్స్ లభించింది. ఈ సినిమాకు ఉగాది సెలవు దినం, అలాగే లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తొలి రోజున దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షో నుంచి మంచి టాక్ రావడంతో మ్యాట్నీ, ఫస్ట్ షోకు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది.

రంగ మార్తండ తొలి రోజు కలెక్షన్లు
ఇక రంగ మార్తండ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు భారీగానే వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల షేర్.. 2 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది. మౌత్ టాక్ వల్ల ఈ వారాంతంలో మంచి కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

రంగ మార్తండ లాభాల్లోకి రావాలంటే..
ఇక రంగ మార్తండ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం బాక్సాఫీస్ వద్ద 4.5 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు రెస్సాన్స్ బాగా ఉంటే.. వారాంతంలోగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











