Ranga Maarthanda: సగానికి సగం డౌన్.. 2 రోజుల్లో కోటి దాటని వసూళ్లు.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో రీమేక్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం కంటెంట్ బేస్‌డ్ మూవీలే ఉంటున్నాయి. ఇప్పుడు అలా రూపొందిన సినిమానే 'రంగమార్తాండ'. టాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు నటించారు. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. ఈ నేపథ్యంలో 'రంగమార్తాండ' మూవీ రెండు రోజల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దామా!

రంగమార్తాండ మూవీలో వాళ్లంతా

రంగమార్తాండ మూవీలో వాళ్లంతా

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రమే 'రంగమార్తాండ'. ఈ మూవీని రాజశ్యామలా ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్లపై మధు, వెంకట రెడ్డి నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, అలీ రేజా, అదర్శ్‌లు నటించారు. ఇళయరాజా సంగీతం ఇచ్చారు.

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్


మరాఠి చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్‌గా వచ్చిందే 'రంగామార్తాండ'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

రెండో రోజు తెలుగులో ఎంతంటే

రెండో రోజు తెలుగులో ఎంతంటే


ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. కానీ, స్పందన మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. దీంతో మొదటి రోజు దీనికి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఇక, రెండో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు సగానికి సగం డౌన్ అయ్యాయి. ఫలితంగా గురువారం ఈ సినిమా కేవలం రూ. 25 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో 'రంగమార్తాండ'కు 2 రోజుల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 68 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?

ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో 2 రోజుల్లో రూ. 68 లక్షలు మాత్రమే వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 6 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 74 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.66 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.60 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 74 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 1.86 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X