Ranga Maarthanda: పెరిగిన వసూళ్లు.. ఆ మార్క్ దాటిన రంగమార్తాండ.. హిట్ కావాలంటే మాత్రం!

ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ఆ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన మూవీనే 'రంగమార్తాండ'. కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపకల్పనలో వచ్చిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'రంగమార్తాండ' మూవీ 3 రోజల బాక్సాఫీస్ రిపోర్టును చూడండి!

రంగమార్తాండ అంటూ వచ్చారు

రంగమార్తాండ అంటూ వచ్చారు

విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రమే 'రంగమార్తాండ'. ఈ మూవీని రాజశ్యామలా ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్లపై మధు, వెంకట రెడ్డి నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, అలీ రేజా, అదర్శ్‌లు నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు.

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్

మరాఠిలో రూపొందిన 'నటసామ్రాట్'కు రీమేక్‌గా వచ్చిన చిత్రమే 'రంగామార్తాండ'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల అయింది.

మూడో రోజు తెలుగులో ఎంతంటే

మూడో రోజు తెలుగులో ఎంతంటే

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. కానీ, స్పందన మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. దీంతో మొదటి రోజు దీనికి తక్కువ వసూళ్లే వచ్చాయి.

ఇక, మూడో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కాసింత పెరిగాయి. ఫలితంగా శుక్రవారం ఈ సినిమా ఏపీ, తెలంగాణలో రూ. 30 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

ఆంధ్రా, తెలంగాణలో 'రంగమార్తాండ'కు 3 రోజుల్లో డీసెంట్ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 98 లక్షలు షేర్, రూ. 2.15 కోట్లు వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?

ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో 3 రోజుల్లో రూ. 98 లక్షలు మాత్రమే వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 8 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 1.06 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

ఎంతో మంది స్టార్లు నటించిన 'రంగమార్తాండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.60 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 1.06 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 1.54 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X