Ranga Maarthanda: మళ్లీ పెరిగిన వసూళ్లు.. ఓవరాల్‌గా మాత్రం నిరాశే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
కెరీర్ ఆరంభం నుంచీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలను తెరకెక్కిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. బడా దర్శకుడిగా సత్తా చాటుతోన్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు 'రంగామార్తాండ' అనే కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ నుంచి మాత్రం ఆశించిన రీతిలో స్పందన దక్కట్లేదు. కానీ, వీకెండ్‌లో వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం 'రంగమార్తాండ' 4 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!

ఎమోషనల్‌గా రంగమార్తాండ
స్టార్ యాక్టర్లు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రమే 'రంగమార్తాండ'. ఈ మూవీని రాజశ్యామలా ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్లపై మధు, వెంకట రెడ్డి నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, అలీ రేజా, అదర్శ్‌లు నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్
'నటసామ్రాట్' అనే మరాఠీ మూవీకి రీమేక్‌గా వచ్చిన చిత్రమే 'రంగామార్తాండ'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది.

4వ రోజు తెలుగులో ఎంతంటే
ఎమోషనల్ కంటెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. కానీ, స్పందన మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. దీంతో మొదటి రోజు దీనికి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఇక, మూడో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కాసింత పెరిగాయి. ఫలితంగా శనివారం ఈ సినిమా రూ. 34 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'రంగమార్తాండ'కు ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 62 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.32 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?
చాలా మంది స్టార్లు నటించిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో 4 రోజుల్లో రూ. 1.32 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 10 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.42 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.60 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 1.42 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 1.18 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











