Ranga Maarthanda: భారీగా పడిపోయిన వసూళ్లు.. 6 రోజుల్లో ఇంతే.. ఇంకెన్ని లక్షలు వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్‌డ్ ఎమోషనల్ స్టోరీలతో మూవీలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో మరిన్ని చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే 'రంగామార్తాండ'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ నుంచి మాత్రం ఆశించిన రీతిలో స్పందన దక్కట్లేదు. వీకెండ్ తర్వాత మరింత వీక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'రంగమార్తాండ' 6 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!

సున్నితమైన కథతో వచ్చేసింది
విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రమే 'రంగమార్తాండ'. ఈ మూవీని రాజశ్యామలా ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్లపై మధు, వెంకట రెడ్డి నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, అలీ రేజా, అదర్శ్‌లు నటించారు. ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చారు.

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్
మరాఠి చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్‌గా వచ్చిన చిత్రమే 'రంగామార్తాండ'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల అయింది.

6వ రోజు తెలుగులో ఎంతంటే
సున్నితమైన కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. కానీ, స్పందన మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. దీంతో మొదటి రోజు దీనికి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఇక, మూడో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కాసింత పెరిగాయి. ఫలితంగా శనివారం ఈ సినిమా రూ. 18 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'రంగమార్తాండ'కు ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో సాధారణ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.72 కోట్లు షేర్, రూ. 3.60 కోట్లు వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రంగమార్తాండ' మూవీకి తెలుగులో 6 రోజుల్లో రూ. 1.72 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 12 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.84 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?
కంటెంట్ బేస్ మూవీగా వచ్చిన 'రంగమార్తాండ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.60 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 1.84 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 76 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











