twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranga Ranga Vaibhavanga day 1 collections ఊహించని విధంగా వైష్ణవ్ తేజ్ కలెక్షన్లు.. కొండపొలం కలెక్షన్ల కంటే..!

    |

    మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా చిత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద తడబడుతున్నది. తొలి ఆట తర్వాత ప్రేక్షకులను, సినీ విమర్శకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను చేపట్టింది. కేతిక శర్మ హీరోయిన్‌గా గిరిశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    కొండపొలం మూవీ కంటే తక్కువగా

    కొండపొలం మూవీ కంటే తక్కువగా

    వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మెగా హీరోకు భారీ క్రేజ్ లభించింది. ఆ తర్వాత కొండపొలం చిత్రం సినీ విమర్శకలు ప్రశంసలు అందుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షాన్ని కురిపించకపోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రంగరంగ వైభవంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కొండపొలం కంటే దారుణమైన వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

    యావరేజ్ ఆక్యుపెన్సీతో

    యావరేజ్ ఆక్యుపెన్సీతో

    రంగ రంగ వైభవంగా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగేతర రాష్ట్రాల్లో అతి తక్కువ అక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ చిత్రం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై సగటున 15 శాతం కంటే తక్కువ అక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకినాడలో 90 శాతం అక్యుపెన్సీతో ఈ సినిమా భారీ ఒపెన్సింగ్స్ లభించాయి. వైజాగ్‌లో 28 శాతం, గుంటూరులో 40 శాతం, వరంగల్‌లో 30 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది.

    అమెరికాలో వసూళ్లు ఇలా

    అమెరికాలో వసూళ్లు ఇలా

    రంగ రంగ వైభవంగా అమెరికాలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను పరిమితమైన లొకేషన్లలో ప్రదర్శించారు. సుమారు 140 లోకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్లు, ఫస్ట్ డే రోజున ప్రదర్శించారు. ఈ చిత్రం 14662 డాలర్లు అంటే 12 లక్షల కలెక్షన్లను వసూలు చేసింది.

    నైజాం, ఆంధ్రాలో

    నైజాం, ఆంధ్రాలో

    రంగ రంగ వైభవంగా చిత్రం హైదరాబాద్‌తోపాటు నైజాంలో కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తొలి రోజున సగటున 24 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఈ మూవీ మత్తం 9.13 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో 50 లక్షల గ్రాస్, ఆంధ్రాలో 75 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ఇక రంగ రంగ వైభవంగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 1.25 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లో 12 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున 1.5 కోట్ల షేర్ సాధించింది. ఇది కొండపొలం సినిమా కలెక్షన్లతో పోల్చుకొంటే చాలా తక్కువ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Visshnav Tej's Ranga Ranga Vaibhavanga movie released on September 2nd. Here are day 1 collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X