Ranga Ranga Vaibhavanga day 3 collections వైష్ణవ్ తేజ్‌కు కోలుకోలేని దెబ్బ..భారీ నష్టాల దిశగా రంగ రంగ!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ పంజా నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూస్తున్నది. గత మూడు రోజుల్లో పేలవమైన వసూళ్లు రాబడుతూ భారీ నష్టాల దిశగా అడుగులేస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేక చతికిలపడింది. గత మూడు రోజులు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పేలవమైన కథ, కథనాలతో
ఉప్పెన, కొండపొలం సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేతికా శర్మ గ్లామర్, భారీ ప్రమోషన్లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే కథ, కథనాలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉండటంతో ప్రేక్షకులు, సినిమా విమర్శకులు పెదవి విరిచారు.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
రంగ రంగ వైభవంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారు 8.5 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 9 కోట్లకుపైగా వసూలు చేయాల్సివచ్చింది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమా నెగిటివ్ ట్రెండ్‌లోకి వెళ్లడంతో చాలా తక్కువగా వసూళ్లు నమోదయ్యాయి.

గత రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
రంగ రంగ వైభవంగా చిత్రం గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి రోజున ఈ చిత్రం 96 లక్షలు, రెండో రోజున 56 లక్షలు షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 1 కోటి రూపాయల షేర్, 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజున 76 లక్షల షేర్, 1.4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

మూడో రోజు కలెక్షన్లు ఇలా..
రంగ రంగ వైభవంగా సినిమా 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సెలవు దినం రోజున ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా 3 రోజున ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారు 3 కోట్ల షేర్, 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రంగ రంగ.. లాభాల్లోకి రావాలంటే..
ఇక రంగ రంగ వైభవంగా సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం 3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం.. ఈ చిత్రం ఇంకా 6 కోట్లకుపైగానే లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











