Rangabali Closing Collections 6.5 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల నష్టమంటే?

యువ హీరో నాగశౌర్య, నూతన దర్శకుడు పవన్ బాసమ్‌శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగబలి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ తదితరులు నటించారు.

జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే అంచనాలకు తగినట్టుగా రంగబలి బాక్సాఫీస్ వద్ద భారీగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ సినిమా గత వారం రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

Rangabali Movie Closing Collections Worldwide: Is Naga Shourya movie Hit? or Flop at Box office?

సొంత ఊరు అనే ఎమోషన్ ఆధారంగా కామెడీ ప్రధానంగా రూపొందిన చిత్రం రంగబలి సుమారు 10 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందింది. ప్రమోషన్స్‌లో నాగశౌర్య చాలా కాన్ఫిడెన్స్‌గా కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫస్టాఫ్ సినిమా అదిరిపోయేలా అనిపించింది. కానీ సెకండాఫ్‌ నిరాశపరచడంతో సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

అయితే రంగబలి సినిమాను మైత్రీ మూవీస్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 6.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమాను నైజాంలో 120 స్క్రీన్లు, సీడెడ్‌లో 45
స్క్రీన్లు, ఆంధ్రాలో 180 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్‌లో 205 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో విడుదల చేశారు.

రంగబలి సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.7 కోట్ల గ్రాస్, రెండో రోజు 1.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 1.5 గ్రాస్, నాలుగో రోజు 75 లక్షలు, 5వ రోజు 70 లక్షలు, 6వ రోజు 50 లక్షలు, 7వ రోజు 40 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Rangabali Movie Closing Collections Worldwide: Is Naga Shourya movie Hit? or Flop at Box office?

గత ఏడు రోజుల్లో రంగబలి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.10 కోట్లు, సీడెడ్‌లో 32 లక్షలు, ఉత్తరాంధ్రలో 42 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 28 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 25 లక్షలు, కృష్ణా జిల్లాలో 27 లక్షలు, నెల్లూరు జిల్లాలో 15 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ వసూళ్లను ఏపీ, నైజాంలో రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రంగబలి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా 7.25 కోట్ల గ్రాస్, 3.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 6.5 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా థియేట్రికల్‌గా కనీసం 3 కోట్ల మేర నష్టాల్లో ముగిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X