Rangabali Collections నాగశౌర్య మూవీకి షాకింగ్‌గా ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా పవన్ బాసమ్‌శెట్టి దర్వకత్వంలో రూపొందిన చిత్రం రంగబలి. యువ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
విరాటపర్వం, దసరా లాంటి విభిన్నమైన చిత్రాలను అందించిన సుధాకర్ చెరుకూరి రంగబలి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారు 10 కోట్లకుపైగా రూపాయలతో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో ప్రదర్శించారు.

నాగశౌర్య, యుక్తి తరేజా నటించిన కామెడీ ఎమోషనల్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సొంత ఊరు అనే ఎమోషన్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ టాక్, సెకండాఫ్ ట్రాక్ మిస్ అయిందనే టాక్ వినిపించింది. నాగశౌర్య, సత్య కాంబినేషన్ హిలేరియస్‌గా ఉందనే టాక్‌తో ముందుకెళ్తున్నది.
రంగబలి సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ప్రీమియర్లను గురువారం రాత్రి ప్రదర్శించారు. అమెరికాలో 102 లోకేషన్లలో 200 షోలు స్క్రీనింగ్ చేశారు. ప్రీమియర్ల ద్వారా 12K డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 129 లొకేషన్లలో 275 షోల ద్వారా 9K డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

రంగబలి సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఓ మోస్తారు ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. మార్నింగ్ షో 20 శాతం, మ్యాట్నీకి 20 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
రంగబలి తొలి రోజు ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, తెలంగాణతోపాటు కన్నడ రాష్ట్రంలో మొత్తంగా ఈ సినిమా 2 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











