అఫీషియల్: రూ. 200 కోట్లతో చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. నాన్ బాహుబలి కేటగిరీలో రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డుల కెక్కింది.
మార్చి 30న సినిమా విడుదల కాగా..... సరిగ్గా నెలరోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
సినిమా విడుదలైన తొలి వీకెండ్‌లోనే రూ. 100 కోట్ల మార్కును అందుకున్న రంగస్థలం.... రెండు వారాలు పూర్తికాక ముందే (11 రోజుల్లో) 150 కోట్లు వసూలు చేసింది. తాజాగా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ. 116 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా రంగస్థలం దుమ్మురేపింది. ఇప్పటి వరకు 3.49 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ఓవరాల్ రన్‌లో 3.5 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని అంచనా.


Click it and Unblock the Notifications











