Rangasthalam Collections జపాన్‌లో చరిత్ర సృష్టించిన రంగస్థలం..అదీ రాంచరణ్ బాక్సాఫీస్ స్టామినా అంటే
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలిచిన రంగస్థలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. చెర్రీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం జపాన్‌లో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. తొలి రోజే అక్కడ రిలీజైన భారతీయ సినిమాల కలెక్షన్లను అధిగమించింది. ఎవరూ ఊహించని కలెక్షన్లను రంగస్థలం సినిమా నమోదు చేసింది. రంగస్థలం సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రంగస్థలం గ్రామంలో చెవిటి వాడైన చిట్టిబాబు తన గ్రామాభివృద్ది కోసం శ్రమిస్తుంటాడు. పట్నంలో చదువుకొంటున్న తన అన్నకు జరిగిన అన్యాయానికి ఎలా పగతీర్చుకొన్నాడనే కథగా రంగస్థలం తెరకెక్కింది. గ్రామీణ యువకుడిగా ముతక రోల్‌లో సినీ ప్రేక్షకులను రాంచరణ్ విశేషంగా ఆకట్టుకొన్నాడు. సమంత రుత్ ప్రభు, రాంచరణ్ మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పడటం, సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ అందర్ని తట్టడంతో రంగస్థలం సినిమా హిట్‌గా నిలిచింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన రంగస్థలం సినిమా జపాన్‌లో జూలై 14వ తేదీన రిలీజైంది. జపాన్‌లో ఈ చిత్రాన్ని దాదాపు 70 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను జపాన్‌లో స్పేస్ బాక్స్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

RRR మూవీ ఆస్కార్ అవార్డు సాధించడంతో రాంచరణ్‌కు జపాన్‌లో ఊహించని ఫాలోయింగ్ పెరిగింది. రాంచరణ్‌కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. RRR చిత్రం తర్వాత రంగస్థలం సినిమా రిలీజ్ కావడంతో అభిమానులు పోటెత్తారు. రంగస్థలం సినిమా థియేటర్లు కిక్కిరిసి పోయాయి. దాంతో రంగస్థలం సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

రంగస్థలం సినిమాకు తొలి రోజున 2.5 మిలియన్ల యెన్స్ వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 15 లక్షల రూపాయలు రాబట్టింది. శని, ఆదివారం రోజున ఈ సినిమా భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని స్పేస్ బాక్స్ సీఈవో అంబరసి దురైపాండ్యన్ అన్నారు. ఈ సినిమాను రానున్న రోజుల్లో మరిన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తాం అని చెప్పారు.
జపాన్‌లో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలను స్పేస్ బాక్స్ రిలీజ్ చేస్తున్నది. ఇప్పటికే అక్కడ భజ్‌రంగీ భాయ్‌జాన్, అంధాధూన్, సూపర్ 30, వారిసు, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలను వారు రిలీజ్ చేశారు. ఇక ముందు కూడా భారతీయ సినిమాలను భారీగా రిలీజ్ చేస్తామని స్పేస్ బాక్స్ సీఈవో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











