‘రంగస్థలం’ ఓవరాల్ లాభం ఎంత? ఏరియా వైజ్ ఎవరికి ఎంత?
సినిమా వ్యాపారంలో డబ్బులు పోవడమ తప్ప రావడం చాలా తక్కువ అనేది ఇండస్ట్రికి చెందిన చాలా మంది చెప్పేమాట. అయితే సినిమా పిచ్చితోనో, ప్యాషన్‌తోనో చాలా మంది ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా హిట్ టాక్ వచ్చినా లాభాలు వచ్చేది మాత్రం కొన్ని సినిమాలకు మాత్రమే. ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిన చిత్రం 'బాహుబలి-2'. ఆ సినిమా తర్వాత డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూసింది 'రంగస్థలం' చిత్రానికే అనే టాక్ వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఇందులో రూ. 120 కోట్ల షేర్ రాబట్టింది.

ఓవరాల్ లాభం ఎంత?
‘రంగస్థలం' చిత్రం అన్ని ఏరియాలకు కలిపి రూ. 80 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. రూ. 120 కోట్ల షేర్ వసూలు కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ రూ. 40 కోట్ల మేర లాభ పడ్డట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Recommended Video


నైజాంలో ఎంత వసూలు చేసింది?
నైజాం ఏరియా రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవ్వగా ఈచిత్రం ఇక్కడ రూ. 27 కోట్లు వసూలు చేసింది. రామ్ చరణ్ కెరీర్లో నైజాం ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రం ఇది.

సీడెడ్ ఏరియాలో...
సైడెడ్ ఏరియా రైట్స్ రూ. 12 కోట్లకు అమ్ముడవ్వగా ఇక్కడ ఈ చిత్రం రూ. 17 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 34 రోజుల్లో ఈ చిత్రం ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేసింది.

ఆయా ఏరియాల్లో రూ. కోటి లాభం
నెల్లూరు(రూ. 2.52 కోట్లు), కృష్ణ(4.5 కోట్లు), గుంటూరు(రూ. 6 కోట్లు), ఈస్ట్ (5.4 కోట్లు), వెస్ట్ (4.20 కోట్లు) ఏరియాల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ దాదాపు రూ. కోటి మేర లాభ పడ్డట్లు సమాచారం. బాహుబలి2 తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమాగా ‘రంగస్థలం' నిలిచింది.

ఉత్తరాంధ్రలో...
ఉత్రరాంధ్రలో రూ. 8 కోట్లకు రంగస్థలం రైట్స్ అమ్ముడవ్వగా రూ. 12 కోట్లు వసూలు చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు తమ ఖాతాలో వేసుకున్నారు. బాహుబలి-2 తర్వాత ఈ ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చిన చిత్రం ఇదే అని అంటున్నారు.

ఓవర్సీస్ ఏరియాలో
ఓవర్సీస్ ఏరియా రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మడవ్వగా అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఈ చిత్రం అద్భుతంగా ఆడటంతో రూ. 16.5 కోట్లు వసూలు చేసి మంచి వసూళ్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











