twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ‘రంగస్థలం’

    By Bojja Kumar
    |

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' స్థలం మరో రికార్డ్ బద్దలు కొట్టింది. హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది.

    Recommended Video

    Rangasthalam Creates New Records In Nizam

    గతంలో ఈ రికార్డు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'పోకిరి' పేరు మీద ఉండేది. పోకిరి సుదర్శన్ థియేటర్‌లో రూ.1,61,43,081 ఫుల్ రన్‌లో వసూలు చేయగా.. 12ఏళ్ల తర్వాత రంగస్థలం 89 రోజుల్లోనే రూ.1.62 కోట్లు రాబట్టి ఆ రికార్డును చెరిపేసింది.

    Rangasthalam

    తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

    రామ్ చరణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాత 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా ఈ చిత్రం రికార్డుల కెక్కిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత విడుదలైన భరత్ అనే నేను మూవీ కూడా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది.

    English summary
    Rangasthalam new Record In Sudarshan 35MM. The movie collects Rs. 1.62 cr in 89 days. Rangasthalam film directed by Sukumar and produced by Y. Naveen, Y. Ravi Sankar and C. V. Mohan under the banner Mythri Movie Makers. The film stars Ram Charan and Samantha Akkineni in the lead roles, along with Aadhi Pinisetty, Jagapati Babu, and Prakash Raj in other pivotal supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X