బాక్సాఫీస్‌ను హడలెత్తిస్తున్న చేస్తున్న సింబా.. 200 కోట్లపై కన్నేసిన రణ్‌వీర్!

Recommended Video

Ranveer Singh's Simmba Movie Crosses Rs 100Cr | FILMIBEAT TELUGU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాలీవుడ్‌లో సింబా పేరుతో రీమేక్ అయి డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రణ్‌వీర్ సింగ్, సైఫ్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రం తొలి ఆట నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

సింబా తొలిరోజు నుంచే

సింబా తొలిరోజు నుంచే

రణ్‌వీర్ సింగ్ నటించిన సింబా చిత్రం తొలి రోజునే దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.20.72 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇక రోజు రోజుకూ వసూళ్లను పెంచుకుంటూ బాక్సాఫీస్‌ను హడలెత్తించింది. శనివారం రూ.23.33 కోట్లు, ఆదివారం రూ.31.06 కోట్లు సాధించింది. వారాంతం తర్వాత వసూళ్లు తగ్గుముఖం పడుతాయనుకొన్న ట్రేడ్ వర్గాలకు షాక్ గురిచేసింది.

5 రోజుల్లో రూ.100 కోట్లు

5 రోజుల్లో రూ.100 కోట్లు

వారాంతం తర్వాత సోమవారం రూ.21.24 కోట్లతో ఓవరాల్‌గా రూ.96 కోట్ల వద్ద నిలిచింది. ఐదోరోజు మంగళవారం న్యూయర్ హాలీడే కావడంతో సుమారు రూ.30 కోట్లకుపైగానే వసూలు చేసింది. దాంతో రూ.100 కోట్ల క్లబ్‌లో సింబా సునాయసంగా చేరిపోయింది. అంతేకాకుండా రూ.125 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

దేశవ్యాప్తంగా 4 వేలకుపైగా స్క్రీన్లలో

దేశవ్యాప్తంగా 4 వేలకుపైగా స్క్రీన్లలో

సింబా చిత్రం దేశవ్యాప్తంగా 4020 స్క్రీన్లలో రిలీజైంది. అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రణ్‌వీర్‌కు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రూ.100 కోట్ల లక్ష్యం తేలికైపోయింది.

రూ.200 కన్నేసిన రణ్‌వీర్ సింగ్

రూ.200 కన్నేసిన రణ్‌వీర్ సింగ్

బుధవారం, గురు, శుక్రవారాల్లో కూడా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రం శుక్రవారం నాటికి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడానికి పుష్కలంగా అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఈ చిత్రం కలెక్షన్లపరంగా మరింత దూసుకెళ్లే ఛాన్స్ లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X