Rao Bahadur Business: రావు బహదూర్ బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం రావు బహద్దూర్. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్, మ్యూజిక్: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్, క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

రావు బహద్దూర్ సినిమా కథ విషయానికి వస్తే.. రామప్ప (సత్యదేవ్) 60 ఏళ్ల వృద్దుడు. శారీరకంగా ఓ రుగ్మతతో బాధపడుతుంటాడు. ఆ వృద్ధుడి జీవితంలో ఏం జరిగింది? ఆయన యవ్వనంలో జరిగిన సంఘటనలు, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో క్యాస్టూమ్‌కు, మేకప్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సినిమాకు సెట్స్, గ్రాఫిక్స్‌కు భారీగా ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమాను ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు.
ఈ మూవీకి మహేష్ బాబు అండగా నిలువడంతో ఊహించని క్రేజ్ వచ్చింది. దాంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను 7 కోట్ల రూపాయల మేర చెల్లించి ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఇతర రైట్స్‌తో మరో 5 కోట్ల మేర వసూలు అయినట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దాంతో నాన్ థియేట్రికల్ 12 కోట్ల రూపంలో వచ్చాయి. ఈ సినిమాలో దాదాపు 35 శాతం రికవరీని సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. నిర్మాతలు, GMB సంస్థలు ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. దాంతో ఈ సినిమాను కమీషన్ బేస్ మీద డిస్టిబ్యూటర్లతో విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంధ్రా, సీడెడ్‌లో ధీరజ్ సినిమాస్, కర్ణాటకలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో థింక్ స్టూడియో ఇండియా, ఓవర్సీస్‌లో అథర్వణ గ్లోబల్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ విషయానికి వస్తే.. ఈ చిత్రం కనీసం 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి వస్తుంది. ఆ మేరకు కలెక్షన్లు సాధిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతకు మించి కలెక్షన్లు రాబడితే.. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందనే వేచి చూడాల్సిందే. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications