Rao Bahadur Day 1 Collections: రావు బహదూర్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి తొలిరోజు ఎంతంటే?

విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావు బహదూర్. సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు రావు బహదూర్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో దీపా థోమస్ హీరోయిన్‌గా నటించారు.

రావు బహదూర్‌లో వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 3న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో రావు బహదూర్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు సత్యదేవ్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

Rao Bahadur Day 1 Expected Box Office Collections Worldwide Saya Dev s film Opening day Report

రావు బహదూర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రావు బహదూర్ మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సత్యదేవ్ క్రేజ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా రావు బహదూర్‌పై హైప్ నెలకొంది. దాంతో రావు బహదూర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ పరంగా మంచి బిజినెస్‌ను సొంతం చేసుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రావు బహదూర్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
రావు బహదూర్ డిజిటల్ రైట్స్‌, మ్యూజిక్, శాటిలైట్, ఇతర హక్కుల ద్వారా 12 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాను నిర్మాతలు, జీఎంబీ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్నాయి. అయితే రావు బహదూర్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

రావు బహదూర్ అడ్వాన్స్ బుకింగ్
రావు బహదూర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సత్యదేవ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు మెరుగైన బుకింగ్ జరుగుతోంది. భారత్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లో 985 షోలకు గాను 52 వేల టికెట్లు అమ్ముడై 79 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది రావు బహదూర్. తెలంగాణలో 45 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 26 లక్షల రూపాయలు, కర్ణాటకలో 6 లక్షల రూపాయలు, తమిళనాడులో 1.22 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 23 వేల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశాడు సత్యదేవ్.

రావు బహదూర్ ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల కంటే నార్త్ అమెరికాలోనే రావు బహదూర్‌కు ఆదరణ దక్కుతోంది. సత్యదేవ్ గత సినిమాలు, ఆయన విలక్షణ నటన నేపథ్యంలో రావ్ బహదూర్ మూవీకి అమెరికాలో ప్రీమియర్స్‌కు ఊహించని స్పందన లభించింది. ప్రీమియర్స్‌లోనే ఈ సినిమా అమెరికాలో 100K డాలర్లు (దాదాపు 95 లక్షల రూపాయలు) రాబట్టినట్లు నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రకటించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో సత్యదేవ్ మూవీ ప్రీమియర్స్+ డే 1లో 125K డాలర్లు (1.20 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తద్వారా అడ్వాన్స్ బుకింగ్‌లో రావు బహదూర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయలు వచ్చింది.

రావు బహదూర్ తొలిరోజు వసూళ్లు అంచనా
రావు బహదూర్ మూవీకి బుకింగ్స్ ఇంకా పుంజుకోలేదు. నాగబంధం, మట్టి కుస్తీ 2, ఆల్ఫాతో పాటు మా ఇంటి బంగారం తదితర సినిమాల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో తొలిరోజు బుకింగ్స్ అంతంగా మాత్రంగా జరుగుతున్నాయి. వీకెండ్ కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి రావు బహదూర్‌కి బుకింగ్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రావు బహదూర్ మూవీకి భారత్‌లో 453 షోలు మాత్రమే ప్రదర్శితమై 28 శాతం ఆక్యూపెన్సీ సాధించినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 194 షోలు, విశాఖలో 57 షోలు, విజయవాడలో 46 షోలు, బెంగళూరులో 40 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. తొలిరోజు ఇప్పటి వరకు రావు బహదూర్ సినిమాకి ఇండియాలో 50 లక్షల రూపాయల గ్రాస్ వసూలైంది. తొలిరోజు సత్యదేవ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.50 కోట్ల రూపాయలు చొప్పున 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X