Rao Bahadur Day 2 Collection: రావు బహదూర్ బాక్సాఫీస్ రిపోర్ట్.. సత్యదేవ్ మూవీకి రెండో రోజు వసూళ్లు ఎంత?

సత్యదేవ్, దీపా థోమస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావు బహదూర్. జూలై 3న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదలైంది. పీరియాడికల్, సైకాలజీ థ్రిల్లర్‌గా విడుదలకు ముందే భారీ అంచనాలు తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తొలిరోజు ఊపును రెండో రోజు కూడా రావు బహదూర్ కొనసాగించాడా? శనివారం సత్యదేవ్ మూవీకి ఎంత వసూలైంది? ఈ వివరాలు పరిశీలిస్తే.

రావు బహదూర్ బడ్జెట్ ఎంత?
రావు బహదూర్ మూవీని 40 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కించారు. రావు బహదూర్ మూవీని తెలుగు రాష్ట్రాలు, భారత్, ఓవర్సీస్‌లో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

Rao Bahadur Day 2 Expected Box Office Collections Worldwide Satya Dev film get steady collections

రావు బహదూర్ తొలిరోజు కలెక్షన్స్
సత్యదేవ్ మూవీకి తొలిరోజున ఇండియాలో 1.68 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజున రావు బహదూర్‌కు 1054 షోలు ప్రదర్శితమై.. 31.8 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. మొత్తంగా 110.7K టికెట్లు అమ్ముడైనట్లుగా విశ్లేషకులు అంటున్నారు. తొలిరోజున తెలంగాణలో 86 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 65.08 లక్షల రూపాయలు, కర్ణాటకలో 13.73 లక్షల రూపాయలు, తమిళనాడులో 1.96 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 40 వేల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 3.08 లక్షల రూపాయలు వసూలైనట్లుగా చెబుతున్నారు.

రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో సత్యదేవ్ మూవీకి ప్రీమియర్స్ + డే 1 వసూళ్లు కలిపి 200కే డాలర్లు (1.90 కోట్ల రూపాయలు) వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ అమెరికాలో రావు బహదూర్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 700కే డాలర్లు (6.66 కోట్ల రూపాయలు) రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు విలువ నిర్దేశించారు. ఇప్పటికే 200కే డాలర్లు వసూలు చేసినందున మరో 500 డాలర్లు రాబడితే నార్త్ అమెరికాలో సత్యదేవ్ మూవీ గట్టెక్కినట్లే. వీకెండ్‌లో మరో రెండ్రోజులు మిగిలే ఉండటంతో పాటు మంచి బుకింగ్స్ జరుగుతుండటంతో తొలి వారాంతానికే రావు బహదూర్ బ్రేక్ఈవెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌ కలెక్షన్స్‌తో కలిపి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రావు బహదూర్ మూవీ 3.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. అయితే తమ చిత్రం 3.9 కోట్ల రూపాయలు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

రావు బహదూర్ రెండో రోజు వసూళ్ల అంచనా
నాగబంధం, మా ఇంటి బంగారం తదితర సినిమాల నుంచి పోటీ ఎదురవుతున్నా సత్యదేవ్ మూవీకి మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. వీకెండ్‌ కూడా కలిసిరావడంతో రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇండియాలో 157 కేంద్రాలలో 685 షోలు ప్రదర్శితమై 21 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా ట్రాక్ టాలీవుడ్ నివేదించింది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోలకు మరింత ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇండియాలో రెండో రోజు రావు బహదూర్ మూవీకి 75 లక్షల గ్రాస్ వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. శనివారం ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రావు బహదూర్ మూవీకి 2.50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X