Rao Bahadur Day 3 Collections: రావు బహదూర్‌కు డీసెంట్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి మూడో రోజు ఎంతంటే?
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థోమస్ జంటగా నటించిన మూవీ రావు బహదూర్. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన్ మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాల్‌కృష్ణారెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు రావు బహదూర్ మూవీని నిర్మించారు. జూలై 3న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలై మూడు రోజులు కావొస్తున్న నేపథ్యంలో సత్యదేవ్ మూవీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది. మూడో రోజు రావు బహదూర్ వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..
రావు బహదూర్ 2 రోజుల కలెక్షన్స్
రావు బహదూర్ మూవీకి ఇండియాలో తొలిరోజున 1.60 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.70 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 3.90 కోట్ల రూపాయల నెట్.. 4.40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 1.80 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.19 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 34.50 లక్షల రూపాయలు, తమిళనాడులో 4.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.50 కోట్ల రూపాయలు రాబట్టింది.

రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ప్రీమియర్స్, తొలిరోజు ఊపును కంటిన్యూ చేస్తూ శనివారం కూడా రావు బహదూర్ తన హవా చూపించింది. మా ఇంటి బంగారం, నాగబంధం, ఆల్పా తదితర సినిమాలకు పోటీ ఇస్తూ శనివారం నార్త్ అమెరికాలో 50కే డాలర్లు (48 లక్షల రూపాయలు) వసూలు చేసింది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 300కే డాలర్లు (2.85 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వసూళ్లతో కలిపి రావు బహదూర్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 7.37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.
రావు బహదూర్ మూడో రోజు వసూళ్లు అంచనా
వీకెండ్ కావడం, వినూత్నమైన కథ, సత్యదేవ్ క్రేజ్ దృష్ట్యా రావు బహదూర్ మూవీకి ఆదివారం మెరుగైన బుకింగ్స్ జరుగుతోంది. తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత వసూళ్లు పుంజుకుంటున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఇండియా వ్యాప్తంగా 165 కేంద్రాలలో 806 షోలు ప్రదర్శితమైన 21 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా ట్రాక్ టాలీవుడ్ తెలిపింది. ఇప్పటి వరకు మూడో రోజు రావు బహదూర్ మూవీకి ఇండియాలో 90 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.
ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్లు నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రావు బహదూర్ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రావు బహదూర్ మూవీని 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు తెలిపారు. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే రావు బహదూర్ మూవీ క్లీన్ హిట్ కావాలంటే మరో 18 కోట్లు రాబట్టాల్సి ఉంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో రావు బహదూర్ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications



