Rao Bahadur Day 5 Collections: భారీగా క్షీణించిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి ఐదో రోజు ఎంతంటే?

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థోమస్ జంటగా నటించిన మూవీ రావు బహదూర్. జూలై 3న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ వీకెండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. తొలి వారాంతం తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు రావు బహదూర్ ఎంత వసూలు చేసింది? 5వ రోజు వసూళ్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

రావు బహదూర్ 4 రోజుల కలెక్షన్స్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రావు బహదూర్ మూవీని 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేయగా.. క్లీన్ హిట్ కావాలంటే 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. రావు బహదూర్ మూవీకి తొలిరోజున ఇండియాలో 1.40 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.43 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.02 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 34 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 5.90 కోట్ల రూపాయల గ్రాస్.. 5.20 కోట్ల రూపాయల నెట్ రాబట్టాడు రావు బహదూర్.

Rao Bahadur Day 5 Expected Box Office Collections Worldwide Saya Dev s film faces huge drop

ఇండియాలో రావు బహదూర్ కలెక్షన్స్
సత్యదేవ్ మూవీ ఇప్పటి వరకు తెలంగాణలో 2.91 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 57.50 లక్షల రూపాయలు, తమిళనాడులో 7.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.50 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. ఓవర్సీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న రావు బహదూర్ ఆదివారం నార్త్ అమెరికాలో 40K డాలర్లు (38 లక్షల రూపాయలు) వసూలు చేసి వీకెండ్‌ను గ్రాండ్‌గా ముగించింది.

యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్ తదితర దేశాలలో కలిపి రావు బహదూర్‌కు ఇప్పటి వరకు 350K డాలర్లు (3.32 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా తెలిపారు. భారత్‌లో వచ్చిన వసూళ్లతో కలిపి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది రావు బహదూర్.

రావు బహదూర్ ఐదో రోజు వసూళ్లు అంచనా
తొలి వారాంతాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముగించిన రావు బహదూర్ సోమవారం టెస్ట్‌లో మాత్రం ఫెయిల్‌నట్లుగానే కనిపిస్తోంది. ఫస్ట్ మండేలో ఈ సినిమా వసూళ్లను దారుణంగా కోల్పోయింది. మంగళవారం నాటి బుకింగ్స్ చూస్తుంటే ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. ఐదో రోజు సాయంత్రం 4 గంటల వరకు రావు బహదూర్ మూవీకి ఇండియాలో 462 షోలు ప్రదర్శితమై 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సత్యదేవ్ మూవీకి ఐదో రోజు కేవలం 10 లక్షల రూపాయల నికర వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. మంగళవారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రావు బహదూర్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే. సత్యదేవ్ మూవీ క్లీన్ హిట్ కావాలంటే మరో 16 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. వచ్చే శుక్రవారం లెనిన్‌తో పాటు మరికొన్ని థియేటర్స్‌లోకి దిగనున్న నేపథ్యంలో ఈ పోటీని తట్టుకుని సత్యదేవ్ ఎంత వరకు నిలబడతాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X