Animal Box Office Collections 800 కోట్లకు చేరువగా యానిమల్.. పఠాన్, జవాన్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న యానిమల్ రెండోవారంలో కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తదితరులు నటించిన ఈ సినిమా 11వ రోజు ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టిందనే విషయంలోకి వెళితే..
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి తొలివారం 340 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండోవారంలో 8వ రోజు 23 కోట్ల రూపాయలు, 9వ రోజు 35 కోట్ల రూపాయలు, 10వ రోజు 36 కోట్ల రూపాయలు దాంతో ఈ సినిమా ఇండియాలో 445 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

యానిమల్ మూవీ ఓవర్సీస్‌లో కూడా రికార్డులు తిరగరాస్తున్నది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఓవర్సీస్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో పఠాన్, జవాన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డును సొంతం చేసుకొన్నది.

ప్రపంచవ్యాప్తంగా యానిమల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 445 కోట్ల రాబట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ 390 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా 50 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో 10 రోజుల్లోనే ఈ సినిమా 717 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక అన్ని సినిమాలకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున యానిమల్ మూవీ నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా అన్ని భాషల్లో 40 శాతం ఆక్యుపెన్సీతో మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 11వ రోజు 14 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 750 కోట్ల రూపాయలు కలెక్షన్లను నమోదు చేసింది.

యానిమల్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో కొనసాగుతున్నది. త్వరలోనే ఈ చిత్రం 800 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











