Animal Advance Booking Collections జవాన్ రికార్డులు యానిమల్ బ్రేక్.. షారుక్‌కు రికార్డులకు సందీప్ రెడ్డి వంగ

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్వకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో, కబీర్ సింగ్ తర్వాత హిందీలో సందీప్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంచనాలకు అనుగుణంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యానిమల్ సినిమాకు సంబంధించిన అంచనాలను ఆ మూవీ టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచాయి.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు వస్తున్న స్పందన జవాన్, పఠాన్, టైగర్ 3, గదర్ 2 స్థాయిలో ఉండటంతో సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Rashmika Mandannas Animal movie day 1 advance booking Collections worldwide

ఇండియాలోని నేషనల్ మల్టీప్లెక్స్‌ పీవీఆర్ ఐనాక్స్, సినిపోలీస్ లాంటి స్క్రీన్లలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి 2 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. రోజు రోజుకు ఈ సినిమాకు అంచనాలు పెరిగి పోవడంతో ప్రేక్షకులు క్యూ కట్టి టికెట్లు కొంటున్నారు.

హైదరాబాద్‌లో యానిమల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాను దాటేశాయి. ఈ సినిమాను హైదరాబాద్‌లో 555 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటటికే 350 షోలు ఫుల్ అయిపోయాయి. ఇప్పటి వరకు 3.2 కోట్ల రూపాయల వసూళ్లను ఈ మూవీ నమోదు చేసింది.

Rashmika Mandannas Animal movie day 1 advance booking Collections worldwide

ఆస్ట్రేలియాలో యానిమల్ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్లు జవాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను దాటేయడంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. దాంతో తొలి రోజు ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.

యానిమల్ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. అమెరికా, కెనడాలో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 625,000 డాలర్లు, యూఏఈ, మిడిల్ ఈస్ట్‌లో 125,000 డాలర్లు రాబట్టింది. యూకేలో 100000 పౌండ్స్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటికే 9.2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X