Sita ramam day 1 collections సీతారామం మూవీకి అదిరిపోయే రివ్యూలు.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. ప్రఖ్యాత వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా నిర్మించింది. ఫీల్‌గుడ్, ఎమోషనల్, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందంటే..

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఇలా..
సీతారామం చిత్రానికి భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో 4 కోట్ల మేర, సీడెడ్‌లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో 11.5 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్‌లో 2.5 మేర బిజినెస్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల మేర అంచనా కట్టారు. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16.2 కోట్ల బిజినెస్ నమోదు చేసింది.

వన్ సైడ్ పాజిటివ్ టాక్
సీతారామం సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సగటు ప్రేక్షకుడి నుంచి సినీ విమర్శకులు ఈ సినిమాకు భారీ రేటింగ్స్ ఇచ్చారు. కంటెంట్, కథ, కథనాలు చక్కగా ఉండటంతో ఏకపక్షంగా ఈ సినిమాను హిట్ ఖాతాలో వేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజే మంచి వసూళ్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు
తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ నంబర్స్‌తో సీతారామం బాక్సాఫీస్ రన్ మొదలైంది. నైజాంలో 54 లక్షలు, సీడెడ్‌లో 16 లక్షలు, ఉత్తరాంధ్రలో 21 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 15 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 లక్షలు, గుంటూరు జిల్లాలో 15 లక్షలు, కృష్ణా 13 లక్షలు, నెల్లూరు జిల్లాలో 8 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల షేర్, రూ.2.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇతర భాషల్లో కలెక్షన్లు
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో సీతారామం సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో, మిగితా రాష్ట్రాల్లో 15 లక్షలు, ఇతర భాషల్లో 35 లక్షలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో తొలి రోజు 1 కోట్ల షేర్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.05 కోట్ల షేర్, రూ.5.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

సీతారామం ప్రాఫిట్‌లోకి రావాలంటే
తొలి రోజు కలెక్షన్ల తర్వాత సీతారామం బాక్సాఫీస్ రిపోర్టు ఇలా ఉంది. ఈ సినిమా 17 కోట్ల బిజినెస్ చేయగా.. తొలి రోజు 3.05 కోట్లు రాబట్టింది. అంటే రానున్న రోజుల్లో ఈ చిత్రం కనీసం 14 కోట్ల మేర వసూళ్లను సాధిస్తే.. లాభాల్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. తొలి వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











