Animal 3 days Collections 400 కోట్లకు చేరువలో యానిమల్.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సంచనాలను నమోదు చేస్తున్నది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. గత రెండు రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్ల మాదిరిగానే మూడో రోజు అదే ఊపును కొనసాగించింది. బాక్సాఫీస్ వద్ద మూడో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
యానిమల్ మూవీ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 210 కోట్ల షేర్ బాక్సాఫీస్ టార్గెట్‌తో జర్నీని ప్రారంభించింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో సుమారుగా 4000 స్క్రీన్లకుపైగా వసూళ్లను సాధించింది.

యానిమల్ సినిమా ఓవర్సీస్‌లో భారీ ఆదరణను సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమా తొలి రోజు 40 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ రెండో రోజు మరో 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు విషయానికి వస్తే.. మరో 45 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 120 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక యానిమల్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 116 కోట్ల రూపాయలు, రెండో రోజు 120 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 236 కోట్లు వసూలు చేసింది. తెలుగులో, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ వెర్షన్ 113 కోట్లు రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 131 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.
యానిమల్ సినిమా మూడో రోజు కలెక్షన్ల లెక్కల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా హిందీ వెర్షన్ భారీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా 65 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మూడో రోజు తమిళం, తెలుగు, హిందీ, మలయాళంలో 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా మూడో రోజు 130 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనా వేశారు.
యానిమల్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. 236 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడో రోజు కలెక్షనల్ విషయానికి వస్తే 130 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 370 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











