Animal Collections: బాహుబలి 2 రికార్డు బ్రేక్.. యానిమల్ ఎన్ని వందల కోట్లు వసూళ్లు చేసిందంటే?
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రీ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా తాజాగా బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ రికార్డును అధిగమించింది. ఆ వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యథిక వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా 500 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది. గతంలో బాహుబలి 2, పఠాన్, గదర్ 2, జవాన్ సినిమాలు ఈ ఘనతను సాధించాయి. తొలి రోజు నుంచే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

సందీప్ రెడ్డి వంగ రూపొందించిన విధానంతో యూత్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువైన యానిమల్ చిత్రం తొలి రోజు 50 కోట్ల నికర వసూళ్లను సాధించిది. ఇక వరుసగా 3 రోజులు 50 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకొన్నది. అంతేకాకుండా తొలివారంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
తాజాగా యానిమల్ చిత్రం 900 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసింది. దాంతో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కలెక్షన్లను అధిగమించింది. ఈ చిత్రం అన్ని భాషల్లో 550 కోట్ల నికర వసూళ్లను సాధించింది.
యానిమల్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 553 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలోనే ఈ సినిమా 468 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగులో కలిపి 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 29 మిలియన్ల డాలర్లు, 242 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 900 కోట్ల రూపాయలు నమోదు చేసింది.
యానిమల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన 5వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 మూవీ రికార్డు అధిగమించింది. త్వరలోనే పఠాన్ చిత్రం రికార్డుపై ఈ సినిమా గురిపెట్టింది.


Click it and Unblock the Notifications











