4700 కోట్ల కలెక్షన్లతో రష్మిక మందన్న రికార్డు.. ఆగని నేషనల్ క్రష్ బాక్సాఫీస్ జోరు

కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్‌లో అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ యాక్టర్‌గానే కాకుండా బాక్సాఫీస్‌కు లక్కీ చార్మ్‌గా మారింది. అగ్ర హీరోలతో ఆమె నటించిన చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొంటున్న హీరోయిన్‌గా రష్మిక పేరు మార్మోగిపోతున్నది. తాజాగా ఆమె నటించిన కాక్ టెయిల్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. అయితే కొద్ది కాలంగా ఆమె నటించిన సినిమాల రికార్డు కలెక్షన్ల విషయానికి వస్తే..

రష్మిక మందన్న తొలుత గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొని.. తనకంటూ వచ్చిన అవకాశాలతో స్టార్ స్టేటస్‌ను అందుకొన్నారు. అయితే స్టార్ హీరోయిన్ల సినిమాల్లో కూడా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసే పాత్రలతో రాణించారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా హీరోయిన్ ఓరియెంట్ సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకొంటూ కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టించారు. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలు ఆమె ప్రతిభకు మార్కుగా నిలిచాయి.

Rashmika Mandanna Box Office Records

అయితే ఇటీవల కాక్ టెయిల్ 2 సినిమాలో ఆమె నటించిన గ్లామరస్ పాత్ర యూత్‌ను భారీగా కనెక్ట్ చేసింది. షాహిద్ కపూర్, కృతిసనన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. రష్మిక నటించిన సినిమాలు హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతున్నదనే విషయానికి సాక్ష్యంగా ఈ సినిమా నిలిచింది.

రష్మిక నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిన రికార్డుల వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన పుష్ప చిత్రం 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో కలిసి నటించిన వారిసు చిత్రం 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అనంతరం హిందీలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌తో రూపొందించిన యానిమల్ చిత్రం 915 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప మూవీకి సీక్వెల్‌గా రూపొందిన పుష్ప 2 మూవీతో రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1870 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే వికీ కౌశల్‌తో కలిసి నటించిన ఛావా చిత్రం 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సల్మాన్ ఖాన్‌తో జతకట్టిన సికందర్ సినిమా 130 కోట్లు వసూలు చేసింది. తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన కాక్ టెయిల్ 2 చిత్రం 150 కోట్ల వసూళ్లను రాబట్టింది.

రష్మిక కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే.. గత రెండు మూడు సంవత్సరాలుగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నది. అగ్ర హీరోలకు భారీ విజయాలను అందించే పనిలో ఉన్నారు. గత మూడేళ్లలో ఆమె కెరీర్ ఖాతాలో 4700 కోట్లకుపైగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఆమె కెరీర్‌లో 5000 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన హీరోయిన్ల జాబితాలో చేరింది. ఇటీవల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమలో ఏ హీరోయిన్‌కు దక్కని రికార్డు నేషనల్ క్రష్‌కు దక్కింది. రానున్న రోజుల్లో ఆమె నటించే చిత్రాల జాబితాలో రాకా, మైసా రణబాలీ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉండటం విశేషంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X