Rathnam Collections షాకింగ్‌గా రత్నం కలెక్షన్లు.. విశాల్ మూవీకి ఎన్ని కోట్లంటే.. లాభాల్లోకి రావాలంటే?

తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తీకేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్ నిర్మించిన చిత్రం రత్నం. మాస్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన చిత్రంలో పురచ్చి దళపతి విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, మురళీ శర్మ, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరాడీ, తులసి తదితరులు నటించారు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

రత్నం సినిమాలో అగ్ర నటులు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారుగా 60 కోట్ల రూపాయల బడ్జెటో అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Rathnam Box Office Collections Worldwide Vishal Movie good start at GBOC

ఇక హరి, విశాల్ కాంబినేషన్‌లో మూడో సినిమా కావడంతో రిలీజ్‌కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్సాన్స్ రావడంతో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి ఇండియాలో సుమారుగా 600 స్క్రీన్లలో, ఓవర్సీస్‌తో కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక రత్నం మూవీకి ఓపెనింగ్స్ మీడియం రేంజ్‌లో కనిపించాయి. ఇక ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కూడా ఫర్వాలేదనిపించేలా నమోదైంది. ఇక తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు దాదాపు 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక రత్నం మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు తమిళనాడులో మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా తమిళంలో సుమారుగా 1.75 కోట్ల గ్రాస్, తెలుగులో 75 లక్షల గ్రాస్, ఇండియాలో వ్యాప్తంగా మొత్తం 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లె 50 లక్షలు వసూలు చేయడంతో మొత్తంగా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

తమిళంలో 1.7 కోట్ల రూపాయలు, తెలుగులో 55 లక్షల రూపాయలు వసూలు చేయడంతో 2.25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 35 లక్షల రూపాయలు వసూలు చేయడంతో మొత్తంగా 2.6 కోట్లు నమోదు చేసింది.

ఇక మూడో రోజు విశాల్ సినిమా దారుణంగా వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఆదివారం రోజున ఈ సినిమా 1.75 కోట్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో 7 కోట్ల మేర.. ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

రత్నం సినిమా ముందు భారీగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. థియేట్రికల్‌గా ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలు వస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందని వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X