Ravanasura Closing Collections రవితేజ మూవీ 23 కోట్ల టార్గెట్.. రావణాసుర ఎంత వసూలు చేసిందంటే?
యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విడుదల తర్వాత ఆశించినంత రెస్పాన్స్‌ను రాబట్టలేకపోయింది. నెగిటివ్ షేడ్‌లో రవితేజను జీర్ణించుకోలేకపోవడంతో భారీ ఒపెన్సింగ్స్‌ను ఈ సినిమా కంటిన్యూ చేయలేకపోయింది. వారం రోజుల్లోనే రావణాసుర చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
రావణాసుర వాల్యూ ఎంతంటే? : రావణసుర సినిమాను అభిషేక్ పిక్చర్స్ స్వయంగా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేసింది. నైజాంలో 7 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లుగా అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ సినిమా బిజినెస్‌ను 20 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌ను 2.20 కోట్లుగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్లుగా అంచనా వేశారు.

తొలివారంలో రావణాసుర : రావణాసుర చిత్రం తొలివారంలో ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. తొలి రోజు ఇండియాలో 6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రం, శనివారం రెండో రోజున 3.75 కోట్లు, ఆదివారం మూడో రోజున 3.15 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతం తర్వాత ఈ చిత్రం పెద్దగా వసూళ్లు సాధించలేక చతికిలపడింది. తొలివారం ముగిసే సమయానికి సుమారు 16 కోట్ల గ్రాస్ రాబట్టింది.
లేటేస్ట్ రిలీజెస్ నుంచి భారీ పోటీ : ఇక రెండోవారంలో రావణాసుర సినిమాను దాదాపుగా మెజార్టీ థియేటర్ల నుంచి తప్పించారు. దాంతో బొటాబొటిన కలెక్షన్లు సాధిస్తున్నది. ప్రస్తుతం దసరా, శాకుంతలం, రుద్రుడు, విడుదల సినిమాల నుంచి భారీగా పోటీని ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రావణాసుర థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసిందంటే? : రావణాసుర సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 4 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.4 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 75 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 80 లక్షలు, కృష్ణా జిల్లాలో 60 లక్షలు, నెల్లూరు జిల్లాలో 35 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్, 16 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రావణాసురకు ఎంత నష్టమంటే? :
ఇక రావణాసుర చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 90 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 2.4 కోట్లు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ వసూళ్లను 12 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 10 కోట్లు రాబట్టాల్సి ఉంది. దాదాపు ఈ సినిమా 10 కోట్ల మేర నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











