Ravanasura day 1 Collections రావణాసురకు అలాంటి టాక్.. రవితేజ మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, దక్ష నగార్కర్, సుశాంత్, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. రవితేజ నెగిటివ్ షేడ్‌తో చేసిన పాత్ర కారణంగా రావణాసుర చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపింది. రవితేజ ఇటీవల నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు 100 కోట్లకుపైగా రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో రావణాసుర కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. అయితే రావణాసుర తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్: రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలకు రికార్డు కలెక్షన్లు రావడంతో ఈ సినిమాకు కూడా భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు 7 కోట్లకు బేరం జరుగగా, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, అమెరికా, ఇతర ఓవర్సీస్ ప్రాంతాల హక్కులను సుమారు 2.20 కోట్లకు అమ్ముడయ్యాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది.

రావణాసురకు డివైడ్ టాక్.. :ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాల తర్వాత రావణాసుర చిత్రంతో రవితేజ హ్యాట్రిక్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. నెగిటివ్ షేడ్‌లో రవితేజ చేసిన ఫెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ.. అలాంటి పాత్రలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకుండా పోతున్నట్టు సినీ వర్గాల టాక్. అయితే టాక్‌కు భిన్నంగా ఈ సినిమాకు తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ఎక్కువ శాతం హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదు అయ్యాయి.
రావణాసుర తొలి రోజు ఆక్యుపెన్సీ : ఇక రావణాసుర సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోలకు 45 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోలకు 42 శాతం, సెకండ్ షోలకు సుమారు 40 శాతం అక్యుపెన్సీ నమోదు అయింది. ఓవరాల్‌గా ఈ సినిమా 40 నుంచి 42 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. రవితేజ గత చిత్రాలతో పోల్చుకొంటే..రావణాసుర చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది.

రావణాసుర చిత్రం ఓవర్సీస్ కలెక్షన్లు: ఇక రావణాసుర ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది. రావణాసుర ప్రీమియర్లకు 90 లోకేషన్లకు 129 షోల ద్వారా సుమారు 20 వేల డాలర్లు అంటే 16.5 లక్షలు నమోదు చేసింది. తొలి రోజున 140 లోకేషన్ల ద్వారా 322 షోల నుంచి 17 వేల డాలర్లు అంటే 14 లక్షల రూపాయలు వసూలు చేసింది.
రావణాసుర తొలి రోజు ఇండియా కలెక్షన్లు: ఇక ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రావణాసుర చిత్రానికి మంచి ఒపెనింగ్స్ వచ్చాయి. ఇండియావైడ్‌గా ఈ చిత్రాన్ని 1400 షోలు ప్రదర్శించారు. ఏపీ, నైజాంలో ఈ చిత్రం 6.5 కోట్లకుపైగా గ్రాస్, ఇండియావైడ్ 75 కోట్లకుపైగా రూపాయల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సెకండ్ షోకు మంచి కలెక్షన్లు వస్తే ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రావణాసుర లాభాల్లోకి రావాలంటే? : రావణాసుర బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. రవితేజ నటించిన ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం 23 కోట్ల రూపాయల షేర్, 50 కోట్లకుపైగా రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు కలెక్షన్ల మాదిరిగా జోష్‌తో కొనసాగితే ఈ సినిమా వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











