Ravanasura Collections.. రావణాసురకు షాకింగ్ కలెక్షన్లు.. అంచనాలు తప్పిన రవితేజ మూవీ!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించగా, యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్ నటించిన చిత్రం రావణాసుర. ఇటీవల రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్లు అవ్వడంతో భారీ అంచనాలతో ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే: రావణాసుర చిత్రం ప్రీ రిలీజ్ భారీగానే నమోదైంది. నైజాంలో 7 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లకుపైగా రూపాయల మేర వాల్యూ కట్టారు. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ చిత్రం 20 కోట్లకుపైగా వాల్యూ చేశారు. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 2.85 కోట్లు మేర విలువ కట్టారు. ఓవరాల్‌గా ఈ సినిమా 25 కోట్ల మేర వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే ఈ సినిమాను నిర్మాత అభిషేక్ నామా సొంతంగా రిలీజ్ చేయడం తెలిసిందే.

రావణాసుర బడ్జెట్, థియేటర్ కౌంట్: రావణసురలో నటీనటులు భారీగా ఉండటంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాను 50 కోట్లతో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మించింది. ఈ సినిమా థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 240 థియేటర్లు, సీడెడ్‌లో 160, ఆంధ్రాలో 295 థియేటర్లతో మొత్తంగా 695 థియేటర్లలో రిలీజైంది. కర్ణాటకలో 95, ఓవర్సీస్‌లో 150 స్క్రీన్లలో రిలీజైంది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 940 స్క్రీన్లలో ప్రదర్శించడం గమనార్హం.
మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్‌తో తొలి రోజు: గతంలో రవితేజ చిత్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఖిలాడీ తొలి రోజు 6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ 6.3 కోట్లు, ధమాకా చిత్రం 9.45 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అయితే తాజా రావణాసుర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో తొలి రోజు ఏపీ, నైజాంలో కలిపి ఇండియా వైడ్‌గా 6 కోట్లకుపైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.64 కోట్లు, సీడెడ్‌లో 70 లక్షలు, ఉత్తరాంధ్రలో 61 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 30 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 లక్షలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణా జిల్లాలో 23 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల షేర్, 6.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 26 లక్షలు, ఓవర్సీస్‌లో 30 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా 4.90 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అమెరికాలో కలెక్షన్లు ఇలా: రావణాసుర చిత్రం ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీమియర్ల ద్వారా 20 వేల డాలర్లు, తొలి రోజు 17 వేల డాలర్లు వసూలు చేసింది. కలెక్షన్ల విషయంలో రెండోవారం ప్రదర్శిస్తున్న దసరాతో ఈ సినిమా పోటీపడుతున్నది. వారాంతంలో కలెక్షన్ల పుంజుకొంటే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

రావణాసుర లాభాల్లోకి రావాలంటే?: రావణాసుర చిత్రం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే. 26 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు చూస్తే.. ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేదనే విషయం స్పష్టమవుతున్నది. శని, ఆదివారాల్లో పుంజుకొంటే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేస్తుందా? లేదా అనే వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











