Ravanasura day 2 Collections బాక్సాఫీస్ వద్ద రావణాసుర తడబాటు.. రవితేజ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మాస్ మహారాజా రవితేజ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం రావణాసుర. క్రైమ్, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?
అభిషేక్ బ్యానర్ సొంతగానే: రావణాసుర చిత్రం సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా అంచనాలకు తగినట్టే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమాపై నమ్మకం కారణంగానే తాము సొంతంగా రిలీజ్ చేశామని నిర్మాత అభిషేక్ నామా ఇటీవల తెలియజేశారు.

మిక్స్‌డ్ టాక్ కలెక్షన్లపై ప్రభావం : ఇక రావణాసుర సినిమాను అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాను 1000కిపైగా స్క్రీన్లలో ప్రదర్శించారు. రవితేజ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సిని విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌పై భారీగానే ప్రభావం పడిందని చెప్పవచ్చు.
రావణాసుర తొలి రోజు కలెక్షన్లు : ఇదిలా ఉండగా, రావణసుర చిత్రం తొలి రోజు ఏపీ, నైజాంలో కలిపి 4.3 కోట్ల షేర్, 6.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5 కోట్ల షేర్, 9 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ వసూళ్లు గతంలో రవితేజ ధమాకా సినిమాను మించి రాకపోవడం గమనార్హం.

రెండో రోజు ఆక్యుపెన్సీ : రావణాసుర సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే... ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఉంది. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నీకి 25 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా కలెక్షన్లపై ఐపీఎల్ ప్రభావం కూడా పడినట్టు స్పష్టమవుతున్నది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా:
రావణాసుర సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. దాదాపు భారీగానే తగ్గే అవకాశం కనిపిస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఇండియా వైడ్ ఈ చిత్రం 4.5 నుంచి 5 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఇక యూఎస్‌లో 140 లోకేషన్లలో 317 షోల ద్వారా 11 వేల డాలర్లు అంటే 9 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా రెండో రోజు 5 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











