భయానికి సీక్వెల్ ...(‘అవును 2′ ప్రివ్యూ)
హైదరాబాద్: మనకి సీక్వెల్ చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. అందులోనూ హర్రర్ చిత్రాలకు సీక్వెల్స్ అంటే సాహసమే. అటువంటిది రవిబాబు ఆ సాహసానికి పూనుకున్నాడు. పూర్ణ, హర్షవర్ధన్ రానేలు నటించగా రవిబాబు దర్శకత్వంలో రూపొంది 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘అవును'. అవును సినిమాకు రెండో భాగంగా రూపొందిన తాజా చిత్రమే.. ‘అవును 2′. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే మరిన్ని చిత్రాలకు ముఖ్యంగా హిట్ హర్రర్ లకు తెలుగులో సీక్వెల్స్ వచ్చే అవకాసం ఉంది. లెటజ్ వెయిట్ అండ్ సీ.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇందులో సెలకాన్ ట్యాబ్ కీలక పాత్రను పోషిస్తుంది. యువ జంట జీవితంలో ఓ దెయ్యం ఎలాంటి అలజడిని సృష్టించింది? దాని కారణంగా వారు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? అన్నదే సినిమా ఇతివృత్తం.తొలి భాగంలో కనిపించని కెప్టెన్ రాజు ఇందులో కనిపిస్తారు. కథలోని మలుపులు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. నిఖిత పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

రవిబాబు మాట్లాడుతూ... ‘అవును 2′ సినిమా అవునుకు సీక్వెల్ కాదు. దీన్ని రెండో భాగంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా సీక్వెల్స్ అంటే అందులోని పాత్రలు, థీమ్ మాత్రమే తీసుకొని కొత్త కథలు అల్లుతారు. అయితే ‘అవును 2′ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎక్కడైతే మొదటి భాగం పూర్తైందో.. సరిగ్గా అదే షాట్ నుండి రెండో భాగం మొదలవుతుంది. అందుకే.. ఇది అవునుకి రెండో భాగమే కానీ సీక్వెల్ కాదు అన్నారు. రవిబాబు గత చిత్రం లడ్డూ బాబు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఈ చిత్రం తో ఎలాగయినా తిరిగి ఫామ్ లోకి రావాలని కృత నిశ్చయింతో ఉన్నాడు.
టెక్నికల్‌గా చెప్పాలంటే...ఈ సినిమాలో లైటింగ్ సిస్టమ్ పనితనాన్ని కొత్తగా ఆస్వాదిస్తారు. పూర్తి ఎల్‌ఈడీ లైట్లతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కేబుల్ అనేదే లేకుండా సినిమాకి లైటింగ్ సమకూర్చారు. ఇక ఈ సినిమాలో 55నిమిషాల పాటు గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నా సినిమాలో వాటిని గుర్తించలేనంత క్వాలిటీతో ఆ సన్నివేశాలను తీశారు. ఇక ఇదే సినిమాకు ఒక ప్రయోగం కూడా చేశారు. స్క్రిప్ట్ కోసం ఎక్కడా పేపర్ వాడలేదు. మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే డిజిటల్ డాక్యుమెంట్ వాడుతూ పేపర్ అనేదే వాడకుండా సినిమా తీశారు.
డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు'' అని తెలిపారు.
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్
నటీనటులు: హర్షవర్థన్ రానె, పూర్ణ , నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు
స్ర్కీన్‌ప్లే: సత్యానంద్,
కెమెరా: ఎన్.సుధాకర్‌రెడ్డి,
సంగీతం: శేఖర్‌చంద్ర,
ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్,
ఆర్ట్: భూపేష్ ఆర్.భూపతి,
రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.
విడుదల తేదీ: ఏప్రియల్ 3,2015.


Click it and Unblock the Notifications











