twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్

    |

    సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయితే చాలు దేవుడా అనుకున్న నిర్మాతకు క్రాక్ సినిమా ఇచ్చిన షాక్ లు అన్ని ఇన్నీ కావు. సినిమాను ఏ క్షణాన మొదలు పెట్టారో తెలియదు గాని మొదటి రోజే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆలస్యంగా విడుదల అవ్వడం పైగా కేవలం 50% ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడవడంతో వసూళ్లు అందుకోవడం కష్టమే అనిపించింది. కానీ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

    Recommended Video

    Ravi Teja Krack Movie To Enter Profit Zone Soon

    ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

    ఇప్పటివరకూ ఏ మాత్రం తగ్గలేదు

    ఇప్పటివరకూ ఏ మాత్రం తగ్గలేదు

    జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ మొదట రోజే ఆర్థిక వివాదాల వల్ల రెండు షోలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచి మొదలైన క్రాక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫ్లో అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ మాత్రం తగ్గలేదు. వీక్ డేస్ నార్మల్ డేస్ తేడా అని లేకుండా అన్ని రోజులు కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి.

    క్రాక్.. కష్టమే అన్నారు

    క్రాక్.. కష్టమే అన్నారు

    ఈ సినిమా రబితేజ కెరీర్ కు మరో లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ పనైపోయింది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే మాస్ రాజా గత సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మాస్ రాజా చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు కూడా కొన్ని డిజాస్టర్స్ వచ్చాయి.

    మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది

    మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది

    రాజా ది గ్రేట్ అనంతరం టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి సినిమాలు ఏ రేంజ్ లో ప్లాప్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకప్పుడు 30కోట్ల వరకు ఉంటే.. ఆ తరువాత 18కోట్లకు వచ్చేసింది.

    బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది

    బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది

    క్రాక్ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా 17కోట్లకు అటు ఇటుగా పలికింది. ఇక సినిమా మొత్తానికి 50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేవలం హిట్టయితేనే గొప్ప అనుకున్న తరుణంలో సినిమాలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచి ఆశ్చర్యాన్ని కలిగించింది 15వ రోజూ కూడా కోటికి పైగా షేర్స్ వచ్చాయి అంటే క్రాక్ ఏ రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    బాగానే కలిసొచ్చింది

    బాగానే కలిసొచ్చింది

    కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది అంటే ఇక 100% ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. చాలా వరకు థియేటర్స్ టికెట్స్ కొంత పెంచడం వలన బాగానే కలిసొచ్చింది. ఇక క్రాక్ రవితేజ కెరీర్ లోనే అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. దీంతో మాస్ రాజాకు ఎప్పటిలానే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

    English summary
    Mass Maharaja Ravi Teja has created a new record called Crack Never Before throughout his career. Ravi Teja has once again proved his mettle by dusting off the box office. Crack, directed by Gopichand Malineni, has attracted audiences from all walks of life as a commercial. Not only did it receive good openings at the box office on the first day but it continued the next day as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X