‘దేవుడు చేసిన మనుషులు’ ఫస్ట్ డే కలెక్షన్స్
హైదరాబాద్: రవితేజ-ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన 'జులాయి' చిత్రం, మరో వైపు సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రాల పోటీని తట్టుకుని తొలి రోజు రూ. 5.5 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ రేంజిలో కలెక్షన్లు రావడానికి కావడం రవితేజ-పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషనే. అయితే సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈచిత్రం వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం లేక పోలేదు. అయితే రవితేజ-పూరి మూవీ కాబట్టి ఆశాజనకమైన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది.
దేవుడు చేసిన మనుషులు చిత్రం తొలి రోజు మొత్తం 600 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో 563 స్కీన్లు ఇండియాలో, 29 స్క్రీన్లు అమెరికాలో, 8 స్ర్కీన్లు యూకెలో కేటాయించబడ్డాయి. గతంలో విడుదలైన రవితేజ 'దరువు' చిత్రం తొలిరోజు రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. దాంతో పోల్చుకుంటే దేవుడు చేసిన మనుషులు చిత్రానికి తొలిరోజు మరో కోటి అదనంగా వసూలవ్వడం గమనార్హం.


Click it and Unblock the Notifications











