twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka 17 Days Collections: సండే సంచలన వసూళ్లు.. అన్ని కోట్లతో టాప్ లిస్టులో.. లాభాలే అన్ని కోట్లా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి స్టార్‌గా ఎదిగిన మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. హిట్లు ఫ్లాపులను బేరీజు వేసుకోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ స్టార్ హీరో 'ధమాకా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మూడో వారంలోనూ కలెక్షన్లు భారీ స్థాయిలోనే వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 17 రోజుల రిపోర్టును చూడండి!

    ధమాకా చూపాలని వచ్చేశారు

    ధమాకా చూపాలని వచ్చేశారు

    మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన రూపొందించిన మూవీనే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలను పోషించారు.

    Kajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షోKajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షో

    ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

    ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

    స్టార్ హీరో రవితేజ మార్కెట్‌కు అనుగుణంగానే 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

    17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    'ధమాకా'కు 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.15 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

    కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

    17 రోజుల్లో ఎంత వసూలైంది?

    17 రోజుల్లో ఎంత వసూలైంది?

    17 రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 17.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.82 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 1.77 కోట్లు, కృష్ణాలో రూ. 1.70 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో మొత్తంగా రూ. 35.80 కోట్లు షేర్, రూ. 65.26 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

    రవితేజ - శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 35.80 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.46 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.64 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 17 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.90 కోట్లు షేర్‌తో పాటు రూ. 107 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

    ధమాకా మూవీకి భారీ లాభాలు

    ధమాకా మూవీకి భారీ లాభాలు

    ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 41.90 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 22.90 కోట్లు లాభాలు దక్కాయి.

    17వ రోజు ఎక్కువ వసూళ్లతో

    17వ రోజు ఎక్కువ వసూళ్లతో

    టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ మూవీ 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.15 కోట్లు వసూలు చేసింది. తద్వారా 17వ రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో 11వ స్థానానికి చేరింది. ఇందులో RRR టాప్‌లో ఉంది.

    English summary
    Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. This Movie Collects 41.90 CR in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X