Don't Miss!
- Finance
SBI Result: ఫలితాల్లో దుమ్మురేపిన ఎస్బీఐ.. స్టాక్‌లో ఇక దూకుడేనా..!
- News
తెలంగాణా బీజేపీ పనితీరుపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చెయ్యనున్న హైకమాండ్.. కొత్త ప్రయోగం!!
- Sports
INDvsAUS : అశ్విన్ డూప్లికేట్లా బౌలింగ్.. చెమటలు చిందిస్తున్న ఆస్ట్రేలియా టీం!
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka 19 Days Collections: రవితేజ మాస్ కొట్టుడు.. 19వ రోజూ భారీగానే.. మరో 84 లక్షలు వస్తే రికార్డు
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ తెలుగు సినీ ప్రియులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది రెండు వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ గత డిసెంబర్‌లో 'ధమాకా' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ 'ధమాకా' మూవీ 19 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

ధమాకా అంటూ వచ్చిన రవితేజ
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమానే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించారు.
బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
రవితేజ మార్కెట్, సినిమాపై అంచనాల వల్ల 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
19వ రోజు 'ధమాకా'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 58 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలైంది.
Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!

19 రోజుల్లో ఎంత వసూలైంది?
'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 17.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.05 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.82 కోట్లు, కృష్ణాలో రూ. 1.74 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలతో మొత్తంగా రూ. 36.92 కోట్లు షేర్, రూ. 67.36 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల కలయికలో వచ్చిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 19 రోజుల్లో రూ. 36.92 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.54 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.70 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 19 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.16 కోట్లు షేర్‌తో పాటు రూ. 109 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
Golden Globe Awards: RRR పెను సంచలనం.. నాటు నాటు సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్.. ఏషియాలోనే తొలిసారి

ధమాకా మూవీకి భారీ లాభాలు
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 43.16 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.16 కోట్లు లాభాలు దక్కాయి.

మరో 84 లక్షలు వస్తే రికార్డు
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ మూవీకి 19 రోజుల్లో రూ. 24.16 కోట్లు లాభాలు దక్కాయి. అంటే మరో రూ. 84 లక్షలు లాభాలు వస్తే.. ఇది రూ. 25 కోట్ల మార్కును చేరుకుని రికార్డు సాధిస్తుంది.