twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka 2 Days Collections: మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గట్లేదుగా.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. హాలిడేస్ లో సినిమాకు మరిన్ని వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఎక్కువగా మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. అందుకే తొలి రోజు తరహాలోనే రెండవ రోజు కూడా మంచి వసూళ్ళు వచ్చాయి. ఇక సినిమా ఇప్పటివరకు మొత్తం ఎంత కలెక్షన్స్ అందుకుంది? లాభాల్లోకి రావాలి అంటే ఇంకా ఏ రేంజ్ లో రావాలి అనే వివరాల్లోకి వెళితే..

    ధమాకా బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్

    ధమాకా బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్

    ధమాకా సినిమా దాదాపు రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్టు సమాచారం. అయితే ఈ నాన్ థియేట్రికల్ గా బిజినెస్ రూ. 32 కోట్ల రబట్టినట్లు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ గా రూ. 18.30 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ లెక్కల ప్రకారం రవితేజ ధమాకా చిత్రం సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ అంధించినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 19 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    మొదటి రోజే ధమాకా

    మొదటి రోజే ధమాకా

    ధమాకా సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. మొదటి రోజే అతని కెరీర్ లో బెస్ట్ ఒపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కూడా ధమాకా సినిమాపై పెద్దగా ప్రభావం పడలేదు. ధమాకా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.

    2వ రోజు కలెక్షన్స్

    2వ రోజు కలెక్షన్స్

    ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండవ రోజు కూడా ధమాకా కలెక్షన్స్ సాలీడ్ వసూళ్ళను అందుకుంది. నైజాంలో రూ.1.62 కోట్లు, సీడెడ్ లో రూ. 62 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.44 లక్షలు, ఈస్ట్ రూ.20 లక్షలు, వెస్ట్ రూ.14 లక్షలు, గుంటూరు రూ.19 లక్షలు, కృష్ణ రూ.20 లక్షలు, నెల్లూరు రూ.12 లక్షలతో ఆంద్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం శనివారం 3.53 కోట్లు షేర్ వచ్చింది.

    రెండు రోజుల వసూళ్ళు

    రెండు రోజుల వసూళ్ళు

    శుక్రవారం రోజు మాస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఏపీ తెలంగాణలో శని ఆదివారాల్లో మొత్తం వచ్చిన కలెక్షన్స్.. నైజాంలో రూ.3.72 కోట్లు, సీడెడ్ లో 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.00 కోట్లు, ఈస్ట్ లో రూ.44 లక్షలు, వెస్ట్ లో రూ.40 లక్షలు, గుంటూరులో రూ.59 లక్షలు, కృష్ణలో రూ.45 లక్షలు, నెల్లూరులో రూ.25 లక్షలు.. ఏపీ తెలంగాణలో వచ్చిన రెండు రోజుల షేర్ కలెక్షన్స్ రూ.8.19 కోట్లు వచ్చాయి.

    యూఎస్ లో సాలీడ్ డాలర్స్

    యూఎస్ లో సాలీడ్ డాలర్స్

    ధమాకా సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. మాస్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా క్లాస్ ఆడియెన్స్ కూడా సినిమాను ఫ్యామిలిస్ తో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రెండు రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 150K డాలర్స్ కు పైగా రాబట్టింది. ఇక ఆదివారం రోజు కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా రెండు రోజుల్లో ధమాకా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.19 కోట్లు షేర్ రాగా 13.75 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా 9.44 కోట్లు షేర్ వచ్చింది. 16 కోట్ల గ్రాస్ వచ్చింది.

    ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం శనివారం రెండు రోజుల్లో షేర్ రూ.9.44 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల కాగా ఒపెనింగ్స్ హై రేంజ్ లోనే వచ్చాయి. అయితే ఇంకా లాభల్లోకి రావాలి అంటే ఈ సినిమా 9.56 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. మరి ఈ సినిమా సోమవారం రోజు నుంచి ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Mass Maharaja Ravi Teja Dhamaka day 2 official Collections Worldwide:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X