Dhamaka 2 Weeks Collections: రవితేజ సంచలన రికార్డు.. 19 కోట్లకు అమ్మితే 2 వారాల్లోనే షాకింగ్‌గా!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో.. గత ఏడాది వరుసగా రెండు పరాజయాలను చవి చూశాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఆ తర్వాత 'ధమాకా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ 'ధమాకా' మూవీ 2 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

ధమాకా అంటూ వచ్చిన స్టార్

ధమాకా అంటూ వచ్చిన స్టార్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ధమాకా'. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలను పోషించారు.

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

రెండు ఫ్లాపులు వచ్చిన రవితేజ నటించిన 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

14వ రోజు 'ధమాకా'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 52 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలైంది.

2 వారాల్లో ఎంత వసూలైంది?

2 వారాల్లో ఎంత వసూలైంది?


2 వారాల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 15.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.34 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.17 కోట్లు, గుంటూరులో రూ. 1.66 కోట్లు, కృష్ణాలో రూ. 1.60 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో మొత్తంగా రూ. 33.18 కోట్లు షేర్, రూ. 60.51 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

రవితేజ - శ్రీలీల జోడీగా కనిపించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 వారాల్లో రూ. 33.18 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 2 వారాల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.88 కోట్లు షేర్‌తో పాటు రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ధమాకా మూవీకి లాభాలు ఇలా

ధమాకా మూవీకి లాభాలు ఇలా

ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 38.88 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.88 కోట్లు లాభాలు దక్కాయి.

రవితేజ సెన్సేషనల్ రికార్డు

రవితేజ సెన్సేషనల్ రికార్డు

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ధమాకా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇలా రెండు వారాల్లోనే ఈ చిత్రం వంద కోట్లు గ్రాస్‌తో పాటు దాదాపు నలభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా రాబట్టింది. ఫలితంగా రవితేజ కెరీర్‌లోనే అతి వేగంగా ఈ మార్కులు చేరుకున్న చిత్రంగా రికార్డు సాధించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X