Dhamaka Collections: రవితేజ ఊరమాస్ కొట్టుడు.. 6 రోజుల్లోనే అన్ని కోట్లు.. 50 కోట్లతో సంచలన రికార్డు
టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే ఫాలో అవుతోన్న అతడు.. గత ఏడాది 'క్రాక్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.
అయితే, ఈ సంవత్సరం మాత్రం 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలన్న కసితో రవితేజ 'ధమాకా' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఆలస్యం లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు చూద్దామా!

ధమాకా అంటూ వచ్చిన రవితేజ
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రమే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలను చేశారు.

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
రవితేజ నటించిన 'ధమాకా' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. దీనికి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ఓవరాల్‌గా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగింది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'ధమాకా' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.67 కోట్లు షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

6వ రోజుల్లో ఎంత వసూలైంది?
ఆరు రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 9.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.53 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 1.21 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 59 లక్షలతో మొత్తంగా రూ. 20.23 కోట్లు షేర్, రూ. 36.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
రవితేజ - శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 20.23 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.87 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.58 కోట్లు షేర్‌తో పాటు రూ. 56 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ధమాకా మూవీకి లాభాలు ఇలా
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 23.58 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.58 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన 'ధమాకా' మూవీకి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. ఫలితంగా రవితేజ కెరీర్‌లోనే వేగంగా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికితోడు ఈ మూవీ వరుసగా ఆరు రోజులు కోటి రూపాయలకు పైగానే షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











