Dhamaka Collections: రవితేజ దండయాత్ర.. 8వ రోజు సంచలన వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్ల లాభాలేంటి సామీ

టాలీవుడ్‌లో ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారినా.. సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఎప్పటికప్పుడు పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'ధమాకా' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ ఎనిమిది రోజుల రిపోర్టును మీరే చూడండి!

ధమాకా అంటూ వచ్చిన రవితేజ

ధమాకా అంటూ వచ్చిన రవితేజ

టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి సంగీతం ఇచ్చాడు.

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్


మాస్ మహారాజా రవితేజ మార్కెట్‌కు అనుగుణంగానే 'ధమాకా' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ఓవరాల్‌గా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ అయింది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


'ధమాకా' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.53 కోట్లు షేర్, రూ. 2.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

8 రోజుల్లో ఎంత వసూలైంది?

8 రోజుల్లో ఎంత వసూలైంది?


8 రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 10.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.12 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.29 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 64 లక్షలతో మొత్తంగా రూ. 23.18 కోట్లు షేర్, రూ. 42.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా


రవితేజ - శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 23.18 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.70 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 69 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ధమాకా మూవీకి లాభాలు ఇలా

ధమాకా మూవీకి లాభాలు ఇలా

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 27.03 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.03 కోట్లు లాభాలు దక్కాయి.

వసూళ్లు భారీగా.. కెరీర్ బెస్ట్

వసూళ్లు భారీగా.. కెరీర్ బెస్ట్

రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబోలో వచ్చిన 'ధమాకా' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా 7వ రోజు దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.42 కోట్లు వసూలవగా.. 8వ రోజు ఊహించని విధంగా రూ. 1.53 కోట్లు వచ్చాయి. అంటే రెండో వారంలోనూ ఈ సినిమా కుమ్మేసేలా కనిపిస్తోంది. అదే జరిగితే ఇది రవితేజ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X