Dhamaka Collections: 9వ రోజు ధమాకా ఊచకోత.. రవితేజ మూడు రికార్డులు.. అప్పుడే అన్ని కోట్లేంటి భయ్యా!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి.. ఇప్పుడు టాలీవుడ్‌లోనే స్టార్లలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. హిట్లు ఫ్లాపులను చూడకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది రెండు పరాజయాలు ఎదురైన తర్వాత 'ధమాకా' అనే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ తొమ్మిది రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

 ధమాకా చూపేందుకు వచ్చాడు

ధమాకా చూపేందుకు వచ్చాడు


మాస్ మహారాజా రవితేజ - త్రినాథరావు నక్కిన కలయికలో వచ్చిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు.

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్


అంచనాలతో పాటు రవితేజకు ఉన్న మార్కెట్‌ ప్రకారమే 'ధమాకా' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ఓవరాల్‌గా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగింది.

 9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


9వ రోజు 'ధమాకా' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.89 కోట్లు షేర్, రూ. 3.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

9 రోజుల్లో ఎంత వసూలైంది?

9 రోజుల్లో ఎంత వసూలైంది?


'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 12.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.51 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, గుంటూరులో రూ. 1.34 కోట్లు, కృష్ణాలో రూ. 1.25 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో మొత్తంగా రూ. 25.07 కోట్లు షేర్, రూ. 45.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

 ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా


రవితేజ - శ్రీలీల హీరో హీరోయిన్లుగా చేసిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 25.07 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.05 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 77 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బికినీ సైజ్ తగ్గించిన సీరియల్ నటి: టెంప్ట్ చేసే షేపులతో బాబోయ్!
https://telugu.filmibeat.com/television/naagin-fame-mouni-roy-beach-photo-viral-in-internet-116007.html

ధమాకా మూవీకి లాభాలు ఇలా

ధమాకా మూవీకి లాభాలు ఇలా


పక్కా కమర్షియల్ కథతో రూపొందిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 29.47 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.47 కోట్లు లాభాలు దక్కాయి.

రవితేజ సినిమా రికార్డులు

రవితేజ సినిమా రికార్డులు


రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందిన 'ధమాకా' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా 9వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లు షేర్ మార్కును దాటేసింది. అలాగే, ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ మార్కును కూడా చేరుకుంది. అంతేకాదు, ఓవరాల్‌గా ఈ చిత్రం ఇప్పటికే పది కోట్ల లాభాలతో రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X