Dhamaka Business: ఒక్క ఏరియాకే అన్ని కోట్లు.. రెండు ఫ్లాపులు వచ్చినా రవితేజ రికార్డు

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి.. ఆ తర్వాత తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు మరింత చేరువ అయ్యాడు. దీంతో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా రవితేజ సినిమాల మీద సినిమాలు చేస్తూనే వెళ్తోన్నాడు. దీంతో అతడి ఫాలోయింగ్, మార్కెట్ భారీగా పెరుగుతోంది.

'క్రాక్' వంటి భారీ బ్లాక్ బస్టర్‌ తర్వాత రవితేజ వరుసగా 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి రెండు పరాజయాలను చవి చూశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మాస్ హీరో 'ధమాకా' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ మూవీని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

 Ravi Teja Dhamaka Movie Andhra Rights Gets Huge Price

మరో రెండు రోజుల్లోనే విడుదల కాబోతున్న 'ధమాకా' మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, బిజినెస్ కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్రా ఏరియా రైట్స్‌ డీల్ కూడా క్లోజ్ అయిందట. దీనికోసం ఓ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ఏకంగా రూ. 9 కోట్లు చెల్లించినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. వరుసగా ఫ్లాపులు వచ్చినా.. 'ధమాకా' చిత్రానికి ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీ పెద్దలనే ఆశ్చర్యానికి గురి చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన 'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి, చిరాగ్ జైన్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X