Don't Miss!
- News
Sadist: భార్య బయట ఉంటే ఇంట్లో వీడు ఏం చేశాడంటే ?, కూతురిని తల్లిని చేసి ?, క్లైమాక్స్ లో !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రికార్డు ధరకు ధమాకా రైట్స్.. రెండు ఫ్లాపులు పడ్డా రవితేజకు తిరుగులేదుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే బీ, సీ సెంటర్ల పల్స్‌ను పట్టేసి మాస్ హీరోలుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. హీరోగా కెరీర్ మొదలైన కొత్తలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో రవితేజ సక్సెస్‌లకు దూరంగా ఉంటున్నాడు.
Bigg Boss Winner: రేవంత్‌కు బిగ్ షాక్.. ఫినాలేలో ఊహించని ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్
గత ఏడాది వచ్చిన 'క్రాక్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న రవితేజ.. ఇప్పుడు 'ధమాకా' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ మూవీని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముమ్మరం చేసింది.

మరికొద్ది రోజుల్లోనే 'ధమాకా' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయిందట. దీనికోసం ఓ ప్రముఖ సంస్థ ఏకంగా రూ. 12.50 కోట్లు చెల్లించినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
ఇది రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. వరుసగా ఫ్లాపులు వస్తున్నా.. 'ధమాకా' చిత్రానికి ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీ పెద్దలనే ఆశ్చర్యానికి గురి చేసిందనే టాక్ వినిపిస్తోంది.
హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబోలో వస్తున్న 'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి, చిరాగ్ జైన్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.