రవితేజ తాజా చిత్రం 'డాన్ శీను' భారీ డెఫిషిట్?
సాధారణంగా రవితేజ చిత్రాలు టేబుల్ ప్రాఫెట్ తో విడుదల అవుతూంటాయి. అయితే రవితేజ తాజా చిత్రం డాన్ శీను దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు డెఫిషిట్ లో రిలీజ్ అవుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీనికి కారణం అదుపు తప్పిన బడ్జెట్టే అంటున్నారు. శ్రియ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న గోపీచంద్ మలినేని బడ్జెట్ లిమిట్ ని దాటి ఖర్చు పెట్టించాడని, అయితే కిక్ చిత్రం ఇచ్చిన కిక్ తో నిర్మాత వెంకట్ ఓకే చేసారని తెలుస్తోంది. అయితే రవితేజ రెగ్యులర్ మార్కెట్ రేట్ (దాదాపు 20 కోట్లు) ని మించి బడ్జెట్ (23 కోట్లు) బాగా పెరగటంతో అమ్మకం బాగానే జరిగినా డెఫిషిట్ లో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఈ మొత్తం రికవరీ అవ్వాలంటే సూపర్ హిట్ అవ్వాలని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక డాన్ శీను ఈ నెల ఆరవ తేదీన రిలీజ్ అవుతోంది. శ్రీహరి ఓ ముఖ్య పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్ డైలాగులు రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











