Khiladi 2 Days Collections: రెండో రోజే కలెక్షన్స్ డౌన్.. ఇలాగైతే లాభాలు రావడం కష్టమే..?

మాస్ మహారాజా రవితేజ గత ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకు మించి అనే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందు కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాపీస్ వద్ద మాత్రం చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండో రోజు కూడా ఆ ప్రభావం గట్టిగానే కనిపించింది.. రెండో రోజు ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి హీరోయిన్స్ గా నటించిన ‘ఖిలాడి' మూవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్

రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ఖిలాడి' మూవీకి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో రెండవ రోజు ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెండు రాష్ట్రాల్లో రూ. 4.30 కోట్లు షేర్, రూ. 6.80 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక రెండవ రోజు ఏరియాల వారిగా.. నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.95 కోట్లు షేర్, రూ. 3.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

కలెక్షన్స్ డౌన్..

కలెక్షన్స్ డౌన్..

రెండో రోజు సినిమాకు ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గడంతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ తెలంగాణలో 1.95 కోట్లు వసూలు చేసిన ‘ఖిలాడి' వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ చెక్ల్క్ వరకు డౌన్ అయ్యాయి. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో 10 లక్షలకు పైగానే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రెండున్నర కోట్ల కంటే తక్కువగానే వచ్చినట్లు సమాచారం.

రెండు రోజుల్లో..

రెండు రోజుల్లో..

రెండు రోజుల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్..నైజాంలో రూ. 2.64కోట్లు, సీడెడ్‌లో రూ. 89 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 6.25 కోట్లు షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా కర్ణాటక ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని 7.03కోట్ల షేర్ రాబట్టింది. 12కోట్లు గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

Recommended Video

Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే..

బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే..

ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.80 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ సినిమా 25.50 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. రెండు రోజుల్లో సినిమాకు 7.03 కోట్ల షేర్ దక్కింది. ఇక బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయాలి అంటే 16.47కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X