Khiladi 3 Days Collections: ఆదివారం కూడా పెరగని ఖిలాడి కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలి అంటే?

మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ కలయికలో తెరకెక్కిన ఖిలాడి సినిమా గత శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక మొదటి వారం ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. విడుదలకు ముందు కాస్త పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఖిలాడి విడుదల రోజు మాత్రం ఎవరు ఊహించని విధంగా షాకింగ్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆదివారం రోజు అయినా పికప్ అవుతుంది అనుకుంటే కలెక్షన్స్ ఏ మాత్రం పెరగలేదు. ఇక ఖిలాడి సినిమా మూడవ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రీలీజ్ బిజినెస్..

ప్రీ రీలీజ్ బిజినెస్..

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'ఖిలాడి' మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ అయితే బాగానే చేసింది. క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రబితేజపై బయ్యర్లు బాగానే పెట్టుబడులు పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

Recommended Video

Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
3వ రోజు వచ్చిన కలెక్షన్స్

3వ రోజు వచ్చిన కలెక్షన్స్

'ఖిలాడి' మూవీకి మొదటి రోజే కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో రెండవ రోజు ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.41లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

 3 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

3 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

ఖిలాడి సినిమాకు మొదటి రోజు 4.30 కోట్ల షేర్ వసూళ్లు రాగా రెండవ రోజు 1.95కోట్లు వచ్చాయి. ఇక ముడవ రోజు 1.51కోట్లు రాగా మొత్తంగా మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో 7.76కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడు రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్.. నైజం 3.05కోట్లు, సీడెడ్ 1.17కోట్లు, ఉత్తరాంధ్ర 99 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 82 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 7.76కోట్ల కోట్లు షేర్, రూ. 13.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

 వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఖిలాడి సినిమా తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో పెద్దగా వసూళ్లను సాధించలేదు. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 0.62 కోట్లు, ఓవర్సీస్‌లో 0.35కోట్లు, హిందీలో 0.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడవ రోజు ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా ఖిలాడి 8.98కోట్ల షేర్ ను సాదించింది. ఇక 16.30కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి.

బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే..

బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే..

రవితేజ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అనుకోని ఖిలాడి సినిమాతో భారీగానే బిజినెస్ చేశారు. నిర్మాత సేఫ్ అయ్యాడు గాని బయ్యర్లు మాత్రం భారీగా లాస్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా రూ. 24.80 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ మూవీ 25.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. మూడు రోజుల్లో సినిమాకు 8.98 కోట్ల షేర్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 14.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఖిలాడి ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X